Two Women Circumcised : నల్గొండ జిల్లాలో అమానుషం.. ఇద్దరు మహిళలకు శిరోముండనం చేయించిన గ్రామపెద్దలు

నల్గొండ జిల్లాలో అమానుషం జరిగింది. కొండమల్లేపల్లి మండలం రామగుడ్లతండాలో ఇద్దరు మహిళలను గ్రామస్థులు ఘోరంగా అవమానించారు. ఇద్దరు మహిళలకు శిరోముండనం చేయించారు. తండాలో ఓ యువకుడి ఆత్మహత్యకు ఈ ఇద్దరు మహిళలే కారణమన్న అనుమానంతో దారుణానికి ఒడిగట్టారు.

Two Women Circumcised : నల్గొండ జిల్లాలో అమానుషం.. ఇద్దరు మహిళలకు శిరోముండనం చేయించిన గ్రామపెద్దలు

Two Women Circumcised

Two Women Circumcised : నల్గొండ జిల్లాలో అమానుషం జరిగింది. కొండమల్లేపల్లి మండలం రామగుడ్లతండాలో ఇద్దరు మహిళలను గ్రామస్థులు ఘోరంగా అవమానించారు. ఇద్దరు మహిళలకు శిరోముండనం చేయించారు. తండాలో ఓ యువకుడి ఆత్మహత్యకు ఈ ఇద్దరు మహిళలే కారణమన్న అనుమానంతో దారుణానికి ఒడిగట్టారు. అయితే బాధిత మహిళలు ఎవరికీ ఫిర్యాదు చేయకపోవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. రామగుడ్ల తండాలో వారం రోజుల క్రితం రాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అతని ఆత్మహత్యకు కారణాలపై గ్రామ పెద్దలు ఆరా తీశారు. వారికి ఏ సమాచారం తెలిసిందో…అందులో ఎంత నిజముందో తెలియదు కానీ….రాజు ఆత్మహత్యా నేరాన్ని గ్రామ పెద్దలు ఇద్దరు మహిళలకు అంటగట్టారు. పంచాయితీ నిర్వహించి వారిద్దరి వల్లే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామపెద్దలే నిర్ధారించి శిక్ష అమలు చేశారు. బాధిత మహిళలు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ..గ్రామంలో మిగిలిన వారు కానీ ఈ విషయంపై స్పందించలేదు. విషయం పోలీసులు దృష్టికి కూడా వెళ్లలేదు.

West Bengal: వితంతువుకు గుండు గీయించి గ్రామ బహిష్కరణ

హత్య, ఆత్మహత్యలపై అనుమానాలుంటే ఎవరైనా పోలీసులకు ఫిర్యాదుచేయొచ్చు. దాదాపు అన్ని చోట్లా ప్రజలకు పోలీస్‌స్టేషన్‌లు అందుబాటులోనే ఉంటున్నాయి. ఫిర్యాదు స్వీకరించి పోలీసులు దర్యాప్తు చేస్తారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి శిక్షపడేలా చేస్తారు. వీటన్నింటినై నగరాలు, పట్టణాల నుంచి మారుమూల గ్రామాల దాకా అందరికీ అవగాహన ఉంది. అయినా సరే…కొన్ని గ్రామాల్లో పెద్దలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. తమ ఇష్టానుసారం శిక్షలు అమలు చేస్తున్నారు.

రామగుడ్ల తండాలోనూ ఇదే జరిగింది. యువకుడు రాజు ఆత్మహత్యకు ఇద్దరు మహిళలు కారణమయ్యారు..ఎందుక కారణమయ్యారు అన్నదాని గురించి గ్రామపెద్దలు లోతుగా పట్టించుకోరు. జరుగుతున్న ప్రచారం, పైపైన కనిపించే ఆధారాలు చూసి దోషులను నిర్ధారిస్తారు. శిరోముండనం వంటివాటితో మహిళలను శిక్షిస్తున్నామని గ్రామపెద్దలు అనుకుంటున్నారు కానీ…బాధితులు ఫిర్యాదు చేస్తే….తిరిగి వారికే శిక్షలు పడతాయన్న విషయం మర్చిపోతున్నారు.