Gift bait : 60 ఏళ్ల వృధ్దురాలితో సోషల్ మీడియాలో పరిచయం…రూ3.9 కోట్లు మోసం

సోషల్ మీడియాలో పరిచయం..అనంతరం కాలంలో జరిగే మోసాలు... రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా పూణేలో ఒక 60 ఏళ్ల వృధ్దురాలు సోషల్ మీడియాలో  పరిచయం అయిన వ్యక్తి చేతిలో రూ. 3.9 కోట్లు మోస పోయిన ఘటన వెలుగు చూసింది.

Gift bait : 60 ఏళ్ల వృధ్దురాలితో సోషల్ మీడియాలో పరిచయం…రూ3.9 కోట్లు మోసం

Pune Gift Bait

Gift Bait :  సోషల్ మీడియాలో పరిచయం..అనంతరం కాలంలో జరిగే మోసాలు… రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా పూణేలో ఒక 60 ఏళ్ల వృధ్దురాలు సోషల్ మీడియాలో  పరిచయం అయిన వ్యక్తి చేతిలో రూ. 3.9 కోట్లు మోస పోయిన ఘటన వెలుగు చూసింది.

మహారాష్ట్రలోని పూణే లో నివసించే మహిళకు 2020 సెప్టెంబర్ లో సోషల్ మీడియా ద్వారా యూకే కి చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. యూకే లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పి ఆమెతో మెసేజింగ్ యాప్ లో చాటింగ్   చేశాడు. తర్వాతి కాలంలో వారిద్దరూ ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు తెలుసుకుని.. వాట్సప్ చాటింగ్ లో తరచూ చాటింగ్ చేసుకుంటూ … మాట్లాడుకుంటూ ఉండేవారు.

ఈక్రమంలో ఆమెకు పుట్టిన రోజు కానుకగా కొన్ని బంగారు ఆభరణాలు, స్మార్ట్ ఫోన్ పంపిస్తున్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు. కొద్ది రోజులకు సోషల్ మీడియా స్నేహితుడు పంపించిన పార్శిల్   ఢిల్లీలోని విమానాశ్రయానికి వచ్చినట్లు సమాచారం అందుకుంది ఆ మహిళ.

యూకే నుంచి వచ్చిన పార్శిల్ లో విలువైన  వస్తువులు  ఉన్నాయని వాటిని విడుదల చేయటానికి కస్టమ్స్ అధికారులకు టాక్స్ కట్టాలని ఓ ఫోన్ కాల్ అందుకుంది. తన స్నేహితుడికి ఫోన్ చేసి   అడగ్గా వాటికి టాక్స్ కట్టి విడుదల చేయించుకోవాల్సిందిగా అతను సూచించాడు.

దీంతో ఆమె యూకే స్నేహితుడు సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులు చెల్లించింది. అనంతరం విలువైన వస్తువులను గిఫ్టుగా అందుకుంటున్నారు  కనుక వాటికి ఆదాయపన్ను చెల్లించాలని మరో  గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందా మహిళకు. ఆమె అందుకు వారు సూచించిన నెంబర్ కు నగదు బదిలీ చేసింది.

ఆతర్వాత  వేరోక నెంబరు నుంచి ఆ మహిళ మరో ఫోన్ వచ్చింది.  విదేశాల నుంచి విలువైన వస్తువులను అక్రమంగా తెప్పించారు కనుక మీ మీద క్రిమినల్ కేసు పెట్టబోతున్నట్లు ఆ ఫోన్ లోని సారాంశం.  ఈఫోన్ కాల్ తో భయపడిన మహిళ  మోసగాళ్లు అడిగినంత మొత్తాన్ని వారు చెప్పిన బ్యాంకు ఎకౌంట్ కు బదిలీ చేసింది.

ఈ లెక్కన ఆ మహిళను బెదిరిస్తూ మోసగాళ్లు దాదాపు రూ. 3.9 కోట్లు వసూలు చేశారు. 7 నెలల తర్వాత తాను మోసపోయానని గ్రహించిన మహిళ  ఏప్రిల్ 21న  పూణేలోని సైబర్ క్రైమ్ పోలీసులకు  ఫిర్యాదు  చేసింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 419 (వ్యక్తిత్వం ద్వారా మోసం), 420 (మోసం), 385 (దోపిడీకి పాల్పడటానికి వ్యక్తిని గాయపరుస్తారనే భయంతో ఉంచడం) మరియు సమాచార మరియు సాంకేతిక చట్టంలోని సంబంధిత విభాగాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు .

నిందితులు 7 వేర్వేరు ఫోన్ నెంబర్ల నుంచి మహిళకు ఫోన్ చేసి ఆమె ద్వారా 25వేర్వేరు బ్యాంకుల్లోని 67 ఖాతాలకు డబ్బు బదిలీ  చేయించుకుని మోసం చేసినట్లు  సైబర్ క్రైమ్ పోలీసు  స్టేషన్ ఎస్సై అంకుష్ చింతామణి చెప్పారు.  కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రజలు సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ లు యాక్సెప్ట్ చేయవద్దని పోలీసుల సూచిస్తున్నారు. తల్లితండ్రులు తమ పిల్లలకు తెలియని వ్యక్తులతో స్నేహం చేయవద్దని చెప్పాలని వారు కోరుతున్నారు.