Harassment : పిల్లలు పుట్టలేదని, పోర్న్‌స్టార్‌గా మారాలని భార్యపై ఒత్తిడి….!

పోర్న్ సినిమాలు తీశాడని ప్రముఖ వ్యాపారవేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ జరుపుతుంటే....మరోక ప్రబుధ్ధుడు పిల్లలు పుట్ట లేదని భార్యను పోర్న్ సినిమాల్లో నటించమని ఒత్తిడి చేయటంతో ఆ టార్చర్ తట్టుకోలేని ఇల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

10TV Telugu News

Harassment : పోర్న్ సినిమాలు తీశాడని ప్రముఖ వ్యాపారవేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ జరుపుతుంటే….మరోక ప్రబుధ్ధుడు పిల్లలు పుట్ట లేదని భార్యను పోర్న్ సినిమాల్లో నటించమని ఒత్తిడి చేయటంతో ఆ టార్చర్ తట్టుకోలేని ఇల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహారాష్ట్రలోని ముంబైలో ఫిజియోథెరపిస్టుగా పనిచేసే మహిళ (29) ముంబైలో ప్రముఖ హోటల్ యజమాని కుమారుడైన నిందితుడిని 2014లో వివాహాం చేసుకుంది. పెళ్లై ఆరేళ్లైనా వారికి పిల్లలు కలగలేదు. పిల్లలు పుట్టలేదని అత్తవారింటివారు ఆమెను వేధించసాగారు. ఆమె భర్తకు అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంది.

ఒకవైపు పిల్లలుపుట్టక పోవటం, మరోవైపు పోర్న్ సినిమాలు చూడటంతో….భార్యను పోర్న్‌స్టార్‌గా మారాలని భర్త ఒత్తిడి తేవటం మొదలెట్టాడు. ఈక్రమంలో జూన్ నెలలో రాత్రి పూట భార్య నిద్రపోతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తికి వీడియో కాల్ చేసి లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. కొన్నిసార్లు ఆమె సున్నిత భాగాలలో ఒక వస్తువును చొప్పించటం ద్వారా ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు.

భర్త ఆగడాలను భరించలేని మహిళ ఖర్ పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది. మహిళ కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి అత్తారింటికి పంపం అని చెప్పటంతో ట్రిపుల్ తలాక్‌తో తెగతెంపులు చేసుకోవాలని నిందితుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారని బాధితురాలు వెల్లడించింది.

తన డాక్యుమెంట్లు, పాస్‌పోర్టు‌తో సహ ఇతర వస్తువులను పత్రాలను ఇవ్వకుండా వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి మొబైల్ ఫోన్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్లకింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

10TV Telugu News