మామ వేధింపులు..కోడలు ఆత్మహత్య

మామ వేధింపులు..కోడలు ఆత్మహత్య

మామ వేధింపులు..కోడలు ఆత్మహత్య

సమాజంలో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వావి వరుసలు లేకుండా కామాంధులు ప్రవర్తిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. కూతురిగా భావించాల్సిన ఓ మామ..కన్నుమిన్నుఆనకుండా ప్రవర్తించాడు. అతను పెట్టే లైంగిక వేధింపులు తట్టుకోలేక..కుటుంబసభ్యలకు చెప్పినా..అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో…ఆ మహిళ తనువు చాలించింది. ఈ విషాద ఘటన…సైఫాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

బషీర్ బాగ్‌లోని పూల్ బాగ్‌కు చెందిన మహిళ (25), గాంధీనగర్‌కు చెందిన రమేష్ ఏడాదిన్నరక్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఏడు నెలల పాప ఉంది. రమేష్ తండ్రి వెంకటేష్ (50) కోడలిపై కన్ను పడింది. కూతురిగా చూసుకోవాల్సిన ఇతను…చెడుగా ఆలోచించడం ప్రారంభించాడు. ఎలాగైనా తన వశం చేసుకోవాలని అనుకున్నాడు. 

వయస్సు కూడా చూడలేదు. మెల్లిగా…ఆమెను లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశాడు. ఇది తప్పని చెప్పింది. కానీ అతను వినిపించుకోలేదు. క్రమ..క్రమంగా అతని వేధింపులు ఎక్కవయిపోయాయి. ఇక లాభం లేదని అనుకుని..తనకు ఎదురైన అనుభవాలను కుటుంబసభ్యులతో పంచుకుంది. 

దీంతో తండ్రిలాంటి వ్యక్తి అలాంటి పనులు చేయవద్దూ..పరువు పోతుందని, అలా ప్రవర్తించవద్దని వెంకటేష్‌కు పలు మార్లు సూచించారు. మారుతాడని ఆ మహిళ అనుకుంది. వెంకటేష్ బుద్ధి ఏ మాత్రం మారలేదు. అలాగే వేధించసాగాడు. ఏం చేసినా..మారడం లేదని తనలోతనే కుమిలిపోయింది. 

ఈ క్రమంలో..రమేష్..తన భార్యను, కుమార్తెను పూల్ బాగ్‌లోని JNNURM ప్రాంతంలో నివాసం ఉంటున్న అత్తింట్లో వదిలివెళ్లిపోయాడు. 2020, మార్చి 05వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మూడో అంతస్తులో ఉంటున్న అన్న ఇంటికి వెళ్లింది. ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు గదిలోకి వచ్చి చూశారు.(అక్కినేని అఖిల్‌కు షూటింగ్‌లో గాయాలు)

గది తలుపులు లాక్ చేసి ఉన్నాయి. వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read More : COVID-19 : విమానాశ్రయాలు వెలవెల..2 లక్షల విమానాలు రద్దు

×