Sexually Assaults : ఇద్దరు కోడళ్లపై కొన్నిరోజులుగా మేనమామ లైంగిక దాడి

తల్లిదండ్రులు లేని పిల్లలను చేరదీసిన మేనమామ వారిపైనే కన్నేశాడు. తన తోబుట్టువు బిడ్డలనీ కూడా చూడకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రిగా మెలగాల్సిన అతడు పాపిష్టి పనికి ఒడిగట్టాడు.

Sexually Assaults : ఇద్దరు కోడళ్లపై కొన్నిరోజులుగా మేనమామ లైంగిక దాడి

Sexually Assaults

Uncle sexually assaults : తల్లిదండ్రులు లేని పిల్లలను చేరదీసిన మేనమామ వారిపైనే కన్నేశాడు. తన తోబుట్టువు బిడ్డలనీ కూడా చూడకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రిగా మెలగాల్సిన అతడు.. పాపిష్టి పనికి ఒడిగట్టాడు. 63ఏళ్ల వయస్సులో కామాంధుడిలా మారి ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు.

కొన్ని రోజుల నుంచి ఈ ఘోరం జరుగుతుండడంతో ఏం చేయాలో తెలియక ఆ బాలికలు బాధను దిగమింగుకొని భరిస్తూ వచ్చారు. ఇంకా అతడి చేష్టలు మితిమీరడంతో అక్కాచెల్లెల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

Young Man Cheating : ప్రేమను నిరాకరించిందని పోలీసులకు పట్టించాడు..చివరికి కటకటాలపాలయ్యాడు

భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్లకు 12ఏళ్ల క్రితం తల్లిదండ్రులు చనిపోయారు. వారిద్దరూ కవలలు. అయితే ఆ బాలికలకు తాను అండగా ఉంటానని, మేనమామ మల్‌రెడ్డి కృష్ణారెడ్డి చేరదీశాడు. ఆ చిన్నారులు కూడా తమ మేనమామే కదా అని ధైర్యంగా అతడితో వెళ్లారు. కానీ వారు ఎదిగిన తర్వాత అతడి బుద్ధి బయటపడింది. కామాంధుడిలా మారి ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అతడి వేధింపులు భరించలేక అక్కాచెల్లెళ్లిద్దరూ ఎదురు తిరగడంతో.. వారిపై మేనమామ కృష్ణారెడ్డి చేయి చేసుకున్నాడు. విషయం బయటకు చెప్తే ఆస్తి మొత్తం తీసుకుని చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో తమను కామాంధుడి చెర నుంచి రక్షించాలని అక్కాచెల్లెళ్లు కొత్తగూడెం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.