Updated On - 12:35 pm, Mon, 1 March 21
Rain of rs 50 crore: మైనర్ బాలికతో నగ్నంగా పూజలు చేయిస్తే.. రూ.50కోట్ల డబ్బు వర్షంలా కురుస్తుందని మోసానికి పాల్పడ్డారు. ఐదుగురు నిందితులపై బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ కింద మహారాష్ట్రలోని నాగ్ పూర్ పోలీసులు కేసు బుక్ చేశారు. బాధితురాలు ఫిబ్రవరి 26న ఇచ్చిన ఫిర్యాదు ఇలా ఉంది.
నెలారంభంలో ఒక వ్యక్తి తనను కలిశాడని, అతను చెప్పినట్లుగా ప్రత్యేక పూజలు చేస్తే ధనవంతులు అయిపోవచ్చని చెప్పాడు. నగ్నంగా చేస్తేనే ఫలితం వస్తుందంటూ వివస్త్రను చేయబోయాడు. మైనర్ కు కాస్త అనుమానంగా అనిపించింది. ఆ పనికి నిరాకరించడంతో ఒత్తిడి పెంచసాగారు.
ఆ సమయంలోనే బాలిక పోలీసులను ఆశ్రయించి లకడ్‌గంజ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. నిందితులను విక్కీ గణేశ్ ఖాప్రే(20), దినేశ్ మహాదేవ్ నిఖారె(25), రామకృష్ణ దాదాజీ మస్కార్(41), వినోద్ జయరాం మస్రాం(42), సోపన్ హరిభవు కుమ్రె(35)లుగా గుర్తించారు.
బాలిక ఫిర్యాదు మేరకు ముందుగా విక్కీ ఖాప్రేను అరెస్టు చేశారు. అప్పుడే ఆ వ్యక్తి ఇతరుల పేర్లను రివీల్ చేశాడు. వారందరి ఆచూకీని పలు ప్రదేశాల్లో కనిపెట్టి అరెస్టు చేశారు. వారందరిపై మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఎరాడిక్షన్ ఆఫ్ హ్యూమన్ శాక్రిఫైస్ లాంటి చట్టాలతో పోక్సో చట్టం కింద కేసు బుక్ చేశారు.
Mohan Bhagwat : ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కరోనా
Protest Against Lockdown : లాక్డౌన్ను వ్యతిరేకిస్తూ వ్యాపారుల వినూత్న నిరసన
Covid Patients Suicide : తీవ్ర విషాదం.. కరోనా బారిన పడ్డ వృద్ధులు ఆత్మహత్య
గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక్కో బెడ్ పై ఇద్దరు కరోనా పేషెంట్లు
జిల్లాల వారీగా అమల్లోకి లాక్డౌన్..
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తల్లికే టోకరా : రూ.2.5 కోట్ల మోసం