యూనివర్శిటీ విద్యార్థినిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్.. హైదరాబాద్‌లా రేపిస్టులను చంపేయాలని డిమాండ్!

  • Published By: sreehari ,Published On : February 15, 2020 / 10:41 AM IST
యూనివర్శిటీ విద్యార్థినిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్.. హైదరాబాద్‌లా రేపిస్టులను చంపేయాలని డిమాండ్!

యూపీలోని బులంద్‌షహర్ జిల్లాలో సైయానా ప్రాంతంలో యూనివర్శిటీ విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై యూపీలోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ విద్యార్థులు వందలాది మంది శనివారం ఉదయం ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ గేటు ఎదుట మరికొంతమంది విద్యార్థులు ధర్నా చేపట్టారు.

విద్యార్థిని గ్యాంగ్ రేప్ ఘటనపై ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ప్రకటనను నిరసిస్తూ ఆయన ఆఫీసు ముందు వందల సంఖ్యలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. హపూర్ జిల్లాలోని గఢ్ ముకటేశ్వర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని గురువారం కాలేజీ నుంచి తిరిగి ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో విద్యార్థిని ఎవరో దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం బాధితురాలిని మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థిని చికిత్స పొందుతోంది.

విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూనివర్శిటీ విద్యార్థులు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తునా నినాదాలు చేస్తూ పోలీసుల ప్రకటనను ఖండిస్తూ ఆందోళన ఉధృతం చేశారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి వారిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో నలుగురు ‘దిశ’ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విధంగా ఇక్కడి రేపిస్టులను హతమార్చాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. #OncemoreHyderabad అంటూ నినాదాలు చేస్తూ.. #HyderabadPart2  (హైదరాబాద్ పార్ట్ 2) అనే కొత్త నినాదంతో విద్యార్థులంతా న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు.

యూనివర్శిటీ విద్యార్థినిపై జరిగింది అత్యాచారం కాదని, బైక్ పై నుంచి కింద పడిందని ప్రకటన చేసిన పోలీసు అధికారిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పోలీసుల విచారణలో.. బాధిత విద్యార్థిని తన తోటి విద్యార్థితో కలిసి ఇంటికి వెళ్తోంది. బైక్ మీద వెళ్లే సమయంలో కిందపడటంతో ఆమెకు గాయమైంది.

మెడికల్ రిపోర్టులో యువతిపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కాలేదు. ఈ కేసు కిడ్నాప్ చేయడం లేదా గ్యాంగ్ రేప్ కాదు’ అని ప్రవీణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. అంతకుముందు మీరట్ పోలీసులు.. సైయానాలో బాధిత యువతిని రక్షించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు.

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు