Marriage Cheating : పెళ్లైన 10 రోజులకే షాకింగ్ న్యూస్…భార్య 8 నెలల గర్భవతి

ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన 10 రోజులకు భార్యకు కడుపు నొప్పి వచ్చింది. పరీక్షలు చేయగా ఆమె 8వ నెల గర్భవతని తేలింది. దీంతో కొత్త పెళ్లికొడుకు స్పృహతప్పాడు

Marriage Cheating : పెళ్లైన 10 రోజులకే షాకింగ్ న్యూస్…భార్య 8 నెలల గర్భవతి

Marriage

Marriage Cheating : ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన 10 రోజులకు భార్యకు కడుపు నొప్పి వచ్చింది.  పరీక్షలు చేయగా ఆమె 8వ నెల గర్భవతని తేలింది. దీంతో కొత్త పెళ్లి కొడుకు స్పృహతప్పాడు.

బరేలి కోటలోని సరాయ్ ప్రాంతంలో ఇటీవల ఒక జంటకు పెళ్లయ్యింది. ఏడు అడుగులు నడిచి తాళి కట్టించుకున్న నవ వధువు  అత్తారింటిలో అడుగు పెట్టింది.  ఇంటి కొచ్చిన కోడల్ని అత్తింటివారు అపురూపంగా చూసుకుంటున్నారు. పెళ్లైన 10 రోజులకు కొత్త పెళ్లికూతురుకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. భర్త వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేయించాడు.

డాక్టర్ పిడుగులాంటి వార్త చెప్పాడు. ఆమె అప్పటికే 8 నెలల గర్భవతని తేల్చాడు. డాక్టర్ మాటలు విన్న వరుడు షాక్‌కు గురయ్యాడు. కాసేపటి తర్వాత తేరుకుని భార్య, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  పెళ్ళికి ముందే గర్భం ధరించిన అమ్మాయిని, మోసం చేసి వివాహం చేశారని తన ఫిర్యాదులో ఆరోపించాడు. కాగా  పెళ్లికి ముందే వారిద్దరికీ పరిచయం ఉందని వధువు కడుపులో పెరుగుతున్న బిడ్డకు వరుడే తండ్రని వధువు తరుఫు వారు వాదించారు. దీన్ని వరుడు ఖండించాడు.
Also Read : Illegal Affair Murder : వివాహేతర సంబంధం.. ఆమె కోసం అన్నీ అమ్మేస్తున్న భర్త

వధువు ఆమె అత్త కొడుకుతో ప్రేమ వ్యవహారం నడుపుతోందని, అతడ్నే పెళ్లి చేసుకోవాలనుకుందని..  కానీ ఆమె కుటుంబ సభ్యులు అబధ్దం చెప్పి పెళ్లి చేశారని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమె కడుపులో పెరిగే బిడ్డకు అతడే తండ్రని వరుడి తరుఫు వారు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆస్పత్రికి తరలించారు.