సుందర్ పిచాయ్ పేరు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించిన యూపీ పోలీసులు

సుందర్ పిచాయ్ పేరు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించిన యూపీ పోలీసులు

Sundar Pichai,  Colleagues dropped from Varanasi FIR over Defamatory Video : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లోక్ సభ నియోజక వర్గమైన వారణాశిలోని భేల్ పూర్ పోలీసు స్టేషన్ లో గూగుల్   సీఈవో సుదర్ పిచాయ్మ, మరో ముగ్గురు గూగుల్ ఇండియా ఉన్నతాధికారులపై నమోదు అయిన కేసులో వీరి పేర్లను యూపీ పోలీసులు ఎఫ్ఐర్ నుంచి తొలగించారు.

వివరాల్లోకి వెళితే….. ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోడీ    ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న వీడియోను వారణాశిలోని గౌరీగంజ్ ప్రాంతానికి చెందిన   గిరిజా శంకర్ అనే వ్యక్తి  వాట్సప్ గ్రూపుల్లో చూశాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ వీడియో అప్ లోడ్ చేసిన ఘాజీపూర్ కు చెందిన విశాల్ సింగ్   వాట్సప్ నెంబర్ కు ఫోన్ చేసి అభ్యంతరం వ్యక్తం చేశాడు.

అనంతరం విశాల్ సింగ్, గిరిజా శంకర్ పేరు, ఫోన్ నెంబరు ఉదహరిస్తూ ఆ వీడియోను యూట్యూబ్ లో అప్ లో్డ్ చేశాడు.   అప్పటి నుంచి గిరిజా శంకర్ కు దాదాపు 8,500 బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.  దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో ఫిబ్రవరి 6న భేల్ పూర్ పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేశారు.

ఆ 18 మందిలో గూగుల్ సీఈవో  సుందర్ పిచాయ్ తో పాటు, గూగుల్ ఇండియాకు చెందిన  ముగ్గురు ఉన్నతస్ధాయి ఉద్యోగులు కూడా ఉన్నారు.   కాగా.. కేసు విచారణలో సుందర్ పిచాయ్, గూగుల్ ఉన్నాతాధికారుల  ప్రమేయం లేదని తేలటంతో వారి పేర్లను  ఎఫ్ఐఆర్ నుంచి తొలగించినట్లు శుక్రవారం పోలీసులు  చెప్పారు.

వీడియో రూపోందించిన ఘాజీపూర్ కు చెందిన సంగీత కళాకారులు, రికార్డింగ్ స్టూడియో, వీడియో చిత్రీకరించిన వారి పేర్లను మాత్రమే ఎఫ్ఐఆర్ లో పొందుపరిచినట్లు పోలీసులు వివరించారు.