Up roar over buffalo : గేదె కోసం గ్రామంలో గొడవ.. నాలుగు రౌండ్ల కాల్పులు

ఉత్తర ప్రదేశ్ లోని అజమ్ గఢ్ జిల్లాలో గేదె విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈగొడవలో ఒక వర్గం వారు మరో వర్గం వారిపై కాల్పులకు తెగబడ్డారు. అదృష్టవశాత్తు ఒక బాలుడుకాల్పుల బారినుంచి తప్పించుకున్నాడు. గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడటంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

Up roar over buffalo : గేదె కోసం గ్రామంలో గొడవ.. నాలుగు రౌండ్ల కాల్పులు

Up Roar For Buffelo

Up roar over buffalo in azamgarh, firing several rounds tension in the village againn : ఉత్తర ప్రదేశ్ లోని అజమ్ గఢ్ జిల్లాలో గేదె విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈగొడవలో ఒక వర్గం వారు మరో వర్గం వారిపై కాల్పులకు తెగబడ్డారు.  అదృష్టవశాత్తు ఒక బాలుడు కాల్పుల బారినుంచి తప్పించుకున్నాడు. గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడటంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

జిల్లాలోని జీన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దౌహ్రా గ్రామంలో నివసించే ఫహీమ్ కుమారుడు యూసఫ్ నెల రోజుల క్రితం .. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి నుంచి రూ. 42 వేలకు గేదెను కొనుగోలు చేశాడు. గేదెను కొనుగోలు చేసేప్పుడు మరో ఏడు నెలల పాటు గేదె పాలు ఇస్తుందని అమ్మిన వ్యక్తి చెప్పాడు.

కానీ యూసఫ్ కొనుగోలు చేసిన   15 రోజల తర్వాత నుంచి గేదె పాలు ఇవ్వటం మానేసింది. దీంతో ఫహీమ్ గేదెను వాపసు తీసుకుని డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగాడు. గేదెను అమ్మిన వ్యక్తి  అందుకు  నిరాకరించాడు.  దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.

ఈ నేపధ్యంలో శనివారం మార్చి27 ఉదయం 11 గంటల సమయంలో ఫహీమ్ ఇంటికి మరోకవర్గానికి చెందిన వారు వచ్చి తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో యూసఫ్ కుమారుడు 15 ఏళ్ల ఫహద్ ఖానా తృటిలో తప్పించుకున్నాడు.

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడటంతో గ్రామంలోపోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. కాల్పులు జరిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.