Uuttar Pradesh : డ్రైవింగ్ రాని దొంగలు .. కారు చోరీ చేసిన 10కిలోమీటర్లు నెట్టుకెళ్లి ఏం చేశారంటే..

వాహనాలు చోరీ చేయటానికి పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఓ కారు దొంగిలించారు. ఆకారు డ్రైవ్ చేయటం చేతకాక ఈ దొంగలపాట్లు మామూలుగా లేవు. కారు చోరీ చేయాలంటే డ్రైవింగ్ కూడా చేతకావాలని అప్పుడు అర్థమైంది ఈ దొంగలకు..ఆ తరువాం ఏం జరిగిందంటే..

Uuttar Pradesh : డ్రైవింగ్ రాని దొంగలు .. కారు చోరీ చేసిన 10కిలోమీటర్లు నెట్టుకెళ్లి ఏం చేశారంటే..

Car theft

Car theft by thieves who do not drive : కారులో ప్రయాణించాలంటే డ్రైవింగ్ రాకపోయినా ఫరవాలేదు. కానీ కారు దొంగిలించాలంటే మాత్రం కచ్చితంగా డ్రైవింగ్ వచ్చి తీరాలి. లేదంటే ఇదిగో ఈ దొంగలకు పట్టిన గతే పడుతుంది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓకారును దొంగిలించారు. కానీ వాళ్లలో ఏ ఒక్కరికి డ్రైవింగ్ రాదు. కారు దొంగిలించాలనుకున్నప్పు వారి కళ్లకు డబ్బులు కనిపించాయి తప్ప తమలో ఎవ్వరికి డ్రైవింగ్ రాదనే విషయం మర్చిపోయారు. దీంతో వాళ్లే ఆ చోరీ చసిన కారును 10కిలోమీటర్ల దూరం తోలుసుకుంటు వెళ్లారు. కానీ ఈలోగా జరిగాల్సినదంతా జరిగిపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులోని దబౌలి ప్రాంతానికి చెందిన సత్యం కుమార్, అమన్ బీటెక్ చదువుతున్నారు. వీరిద్దరికి అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే అమిత్‌ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. ముగ్గురు కలిసి ఈజీ మనీ కోసం ఏదన్నా చేయాలనుకున్నారు. బైక్, కారులాంటి వాహనాలనుచోరీ చేయాలని ప్లాన్ వేసుకున్నారు.దీని కోసం వీరిలో సత్యం అనే యువకుడు ఓ వెబ్ సైట్ తయారు చేసుకున్నారు.దొంగిలించిన వాహనాలను మార్కెట్ లో విక్రయిస్తే దొరికిపోతామనుకుని చోరీ చేసిన వాహనాలు అమ్మటానికి ఓ వెబ్ సైట్ తయారు చేశాడు.

అలా ప్లాన్ వేసుకున్న ఈ ముగ్గురు గత సోమవారం (మే22,2023) రాత్రి వారు ముగ్గురు కలిసి బయటకెళ్లారు. ఓ ప్రాంతంలో పార్క్ చేసిన ఉన్న కారు కనిపించింది. చుట్టుపక్కల ఎవ్వరు లేరు. దాన్ని చోరీ చేసి అమ్మేద్దామనుకున్నారు. కానీ కారు వద్దకు వెళ్లాక తెలిసింది వారిలో ఎవ్వరికి కారు డ్రైవ్ చేయటం చేతకాదని. కానీ కారు చోరీ మాత్రం చేయాల్సిందేనని నిర్ణయించుకున్నారు.

అలా బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారును దొంగిలించారు. కారునైతే దొంగిలించారు కానీ వారిలో ఒక్కరికి కూడా కారు డ్రైవింగ్ చేతకాదు. దీంతో కారును తోసుకుంటూ 10 కిలోమీటర్లు తీసుకెళ్లారు. అక్కడ ఓ నిర్మానుష్య ప్రదేశంలో కారు నంబరు ప్లేటును తీసేసి పార్క్ చేసి వెళ్లిపోయారు. తరువాత ఆ కారు ఫోటోలు వెబ్ సైట్ లో పెట్టి అమ్మాలనుకున్నారు.

కానీ అప్పటికే జరిగాల్సిందంతా జరిగింది. తన కారు కనిపించకపోవటంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కారును గుర్తించారు.అలాగే ఈ ముగ్గురిని గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారుతోపాటు మరో రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.