Young Girl Raped : ఇల్లు మర్చిపోయిన యువతిని ఇంటికి తీసుకెళ్లి భర్తతో….

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తన ఇంటి అడ్రస్ మర్చిపోయిన యువతిని...ఆమె ఇంటికి తీసుకు వెళతానని చెప్పి, తన ఇంటికి తీసుకు వెళ్ళి భర్తతో అత్యాచారం చేయించి నాలుక కోసిన మహిళ ఉదంత

Young Girl Raped : ఇల్లు మర్చిపోయిన యువతిని ఇంటికి తీసుకెళ్లి భర్తతో….

Up Girl Raped

Young Girl Raped : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తన ఇంటి అడ్రస్ మర్చిపోయిన యువతిని…ఆమె ఇంటికి తీసుకు వెళతానని చెప్పి, తన ఇంటికి తీసుకు వెళ్ళి భర్తతో అత్యాచారం చేయించి నాలుక కోసిన మహిళ ఉదంతం వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో వరదలు రావటంతో రహీంనగర్ ప్రాంతంలోని   ఓబస్తీలోని ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. దీంతో అక్కడ ఉన్న ఒక కుటుంబం, లక్నోలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్   పరిధిలోని కొత్త ప్రాంతానికి వెళ్లారు. సెప్టెంబర్ 21 న ఇంటినుంచి బయటకు వచ్చిన ఆ కుటుంబంలోని 19 ఏళ్ళ యువతి తన ఇంటికి దారి మర్చిపోయింది.
Also Read : Classmate Slashes Girl’s Neck :తనతో రొమాన్స్ చేయలేదని గొంతుకోసి చంపాడు

రోడ్డు మీద కనపడిన  ఆర్తి(40) అనే మహిళను తనకు గుర్తున్నంతవరకు ఇంటి అడ్రస్ చెప్పి అక్కడి నుంచి ఎలా వెళ్లాలో చెప్పమని కోరింది. ఇంటికి తీసుకువెళతానని చెప్పి ఆర్తి తన ఇంటికి తీసుకువెళ్లింది. తీరా ఇంటి కెళ్లాక తన భర్తతో శృంగారం చేయాలని కోరింది. అందుకు ఆ యువతి అభ్యంతరం చెప్పటంతో ఆర్తి, ఆమె భర్త మున్నా(45) ఆ యువతిని కొట్టి మంచానికి కట్టేశారు.

ఆర్తి భర్త మున్నా ఆమెపై అత్యాచారం చేశాడు. జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆ యువతి నాలుక కోసేశారు. ఆ తర్వాత వారంరోజుల పాటు మున్నా యువతిపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. సెప్టెంబర్ 29న దంపతులిద్దరూ బయటకు వెళ్లినప్పుడు యువతి ఇంటినుంచి తప్పించుకుని పారిపోయింది.

రోడ్డు మీద కనిపించిన ఒకవ్యక్తి సహాయంతో ఇంటికి చేరుకుంది. తమ కూతురు కనపడని రోజునే యువతి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకున్న కూతుర్ని చూసి తల్లితండ్రులు సంతోషించారు… కానీ ఆమెకు జరిగిన ఘోరాన్ని తెలుసుకుని బావురుమన్నారు. వెంటనే ఆమెను చికిత్సకోసం ఆస్పత్రిలో చేర్పించారు.

కాస్త కుదుటపడిన తర్వాత యువతి తాను ఎట్లా మోసపోయిందో అంతా వివరంగా కాగితం మీద రాసి తల్లి తండ్రులకు చూపించింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఆర్తిని ఆదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతి ఆర్తిని గుర్తుపట్టింది. పరారీలో ఉన్న మున్నాకోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆర్తిని రిమాండ్ కు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.