Upset Over Getting Non-Veg Pizza : పిజ్జా డెలివరీలో పొరపాటు…. కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని కేసు

పుట్ట గొడుగులు పిజ్జాను ఆర్డర్ చేస్తే మాంసాహార పిజ్జాను డెలివరీ చేసి మనోభావాలు దెబ్బ తీసినందుకు అమెరికాకు చెందిన పిజ్జా ఔట్ లెట్ పై ఒక మహిళ కోటి రూపాయల నష్టపరిహారానికి కేసు వేసింది.

Upset Over Getting Non-Veg Pizza : పిజ్జా డెలివరీలో పొరపాటు…. కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని కేసు

Pizza Delivery

Upset Over Getting Non-Veg Pizza, Vegetarian Woman Moves consumer Court, Seeks Rs 1 Crore Compensation : పుట్ట గొడుగులు పిజ్జాను ఆర్డర్ చేస్తే మాంసాహార పిజ్జాను డెలివరీ చేసి  మనోభావాలు దెబ్బతీసినందుకు అమెరికాకు   చెందిన పిజ్జా ఔట్ లెట్ పై ఒక మహిళ కోటి రూపాయల నష్టపరిహారానికి కేసు వేసింది.

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో నివాసం ఉండే దీపాలి త్యాగి అనే మహిళ   మార్చి21, 2019 వ సంవత్సరంలో అమెరికన్ రెస్టారెంట్ ఔట్ లెట్  ఒకదానిలో పుట్టగొడుగుల పిజ్జా ఆర్డర్ చేసింది.  చెప్పిన సమయం కంటే అరగంట  ఆలస్యంగా  పిజ్జాను డెలివరీ చేసింది సదరు సంస్ధ.

ఆలస్యంగా ఐనా పిజ్జా వచ్చినందుకు సంతోషించి  వారి కుటుంబ సభ్యులు పిజ్జాను రుచి చూశారు.  వారికి దాని రుచి ఏదో తేడాగా అనిపించింది.  మళ్లీ ఇంకోసారి రుచి చూసి బిత్తర పోయారు. అది మాంసాహారంతో  చేసిన పిజ్జాగా గుర్తించారు.

వెంటనే ఈ విషయాన్ని సదరు రెస్టారెంట్ మేనేజర్ కు ఫోన్ చేసి చెప్పగా…. అతను నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. కుటుంబ మంతటికీ పిజ్జాలు ఉచితంగా సరఫరా చేస్తానని సమాధానం చెప్పటంతో మహిళ కుటుంబ సభ్యుల మనో భావాలు దెబ్బతిన్నాయి. దీంతో వారు వినియోగ దారుల ఫోరాన్ని ఆశ్రయించారు.

చెప్పిన   సమయం కంటే అరగంట లేటుగా పిజ్జా అందించారు.  పైగా మాంసాహార పిజ్జా తినటం వల్ల మా మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈఅపరాధ భావం మమల్ని జీవితాంతం వెంటాడుతూనే  ఉంటుంది. పరిహార పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నాయి.

మా హోదాను కించపరుస్తూ మా ఇంటికి మొత్తానికి ఉచితంగా పిజ్జాలు సరఫరా చేస్తామని రెస్టారెంట్ మేనేజర్ కించ పరిచారు… అని ఫిర్యాదు చేస్తూ సదరు మహిళ ఢిల్లీకి చెందిన వినియోగదారుల   పరిష్కార కమీషన్ లో పిటీషన్ వేసింది.  పిటీషన్ పరిశీలించిన కమీషన్ అమెరికన్ రెస్టారెంట్ ఔట్ లెట్ కు   నోటీసులు అందించింది.