Molested Children : చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన భర్తని తుపాకితో కాల్చిపారేసిన భార్య..

డేకేర్ సెంటర్ లోని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన భర్తని తుపాకితో కాల్చిపారేసింది భార్య..

Molested Children : చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన భర్తని తుపాకితో కాల్చిపారేసిన భార్య..

US Crime : యూఎస్‌లోని వాషింగ్టన్‌లో మాండరిన్ ఓరియంటల్ హోటల్‌లో ఉంటున్నారు భార్యా భర్తలు జేమ్స్ వీమ్స్, శాంతేరీ వీమ్స్. జేమ్స్ కు 57 ఏళ్లు. శాంతేరీకి 50 ఏళ్లు. వారి ఓ డే కేర్ సెంటర్ నడుపుతున్నారు. 2005లో ఆర్మీ నుంచి రిటైర్ అయి జేమ్స్ గత రెండేళ్లుగా డేకేర్‌లో బస్సు ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో జేమ్స్ వీమ్స్ డేకేర్ సెంటర్ లో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. చిన్నపిల్లలు తమపై ఏం జరుగుతుందో కూడా తెలియని అమాయకులు. జేమ్స్ వేధింపులకు బాధతో ఏడ్చేవారు ఆ చిన్నారులు.

ఈక్రమంలో భర్త జేమ్స్ వీమ్స్ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అతడి భార్య శాంతేరీ వీమ్స్ గుర్తించింది. ముగ్గురు చిన్నారులపై దారుణైన అఘాయిత్యాలకు పాల్పడ్డాడని తెలుసుకుంది. సహించలేకపోయింది.అంతే పట్టరాని ఆగ్రహంతో భర్తని నిలదీసింది. తిట్టింది. దీంతో జేమ్స్ భార్యపై తిరగబడ్డాడు. ఇద్దరి మధ్యా దారుణమైన ఘర్షణ జరిగింది. అంతే చేసింది భరించరాని తప్పు..ఒప్పుకోకపోగా..చేసింది దారుణం అని తెలుసుకోకపోవటం శాంతేరి భరించలేకపోయింది. చిన్నపిల్లలపై నీ పశుత్వం చూపిస్తావా? అంటూ తుపాకీతో కాల్చింది.

ఈ ఘటనపై పోలీసులు శాంతేరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులు పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. నా భర్త చిన్నపిల్లని కూడా చూడకుండా వారిపై లైంగికంగా వేధించడని..అందుకే నా భర్తను కాల్చానని చెప్పింది. కానీ నేను చేసింది నేరం కాదు అని అంటోంది. కాగా తుపాకీ తూటాలతో గాయపడిన జేమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ భర్తను కాల్చి చంపిన నేరాలపై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు గదిలో దొరికిన డైరీని స్వాధీనం చేసుకుని చదివారు. ఆలో డైరీ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ డ్రైరీలో..తన భర్త ముగ్గురి పిల్లల జీవితాలను నాశనం చేశాడని, పలువురి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు రాసి ఉందని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఒక వ్యక్తిని పక్షవాతం వచ్చే వరకు ఎలా కాల్చాలో కూడా దాంట్లో రాసి ఉందని తెలిపారు.

అసలు ట్విస్ట్‌ ఏంటంటే..శాంతేరీ మాత్రం తాను నేరం చేశానని అంగీకరించటం లేదు. దీంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. ఈ మిస్టరీని ఛేదించాలని దర్యాప్తును ముమ్మరం చేశారు.ఈ కేను యూఎస్‌ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే గానీ వివరాలు వెల్లడించలేమన్నారు. శాంతేరి ప్రాథమిక విచారణ నిమిత్తం కోర్టు ముందు హాజరు కావాల్సి ఉందని కూడా తెలిపారు.