వీడు తండ్రేనా? : ప్రతి పుట్టినరోజున.. కన్న కూతురికి కన్యత్వ పరీక్ష : వివాదంలో సింగర్ 

  • Published By: sreehari ,Published On : November 7, 2019 / 11:57 AM IST
వీడు తండ్రేనా? : ప్రతి పుట్టినరోజున.. కన్న కూతురికి కన్యత్వ పరీక్ష : వివాదంలో సింగర్ 

అతడో ర్యాపర్. తన పాటలతో అందరిని మెప్పిస్తాడు. ఇతగాడి పాటలంటే అక్కడి వారికి ఎంతో పిచ్చి. మూడు గ్రామీ అవార్డులతో అమెరికా పాప్ సింగర్‌గా పేరొందిన టిఐ (39) అనే వ్యక్తి.. అసలు పేరు.. క్లిఫ్పోర్డ్ హర్రిస్. ఏ తండ్రి తన కూతురి విషయంలో చేయకూడని పనిచేశాడు.

కన్న కూతురికి కన్యత్వ పరీక్ష చేయించి వివాదాల్లో చిక్కుకున్నాడు. తన 18ఏళ్ల కూతురిని ప్రతి ఏడాది కన్యత్వ పరీక్ష కోసం గైనకాలిజిస్టు దగ్గరకు తీసుకెళ్తున్నాడు. ప్రతి పుట్టినరోజున కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లి కన్యత్వ పరీక్ష చేయిస్తు వస్తున్నాడు. ఆమె హైమెన్ పొర ఎలా ఉందని చెక్ చేస్తున్నాడు.

సాధారణంగా.. తన కూతురి పుట్టిన రోజు పార్టీ తర్వాత ఆమె బెడ్ రూమ్ లో ఒక నోట్ పెట్టేవాడు. అందులో ‘రేపు.. గైనకాలిజిస్టును కలుస్తున్నాం’ అని రాసి ఉంటుందని టిఐ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. డైజా హర్రిస్.. 16వ పుట్టినరోజు నుంచి వైద్యుని సంపద్రించడం మొదలైనట్టు క్లిఫ్పోర్డ్ తెలిపాడు.

కుమార్తె కన్యత్వానికి సంబంధించి తనకు షేర్ చేసేందుకు వైద్యున్ని అనుమతించేలా ఆమెతో సంతకం చేయించుకున్న విషయాన్ని వెల్లడించాడు. ఇంటర్వ్యూలో టిఐ చెప్పిన మాటలన్ని పోడ్ క్యాస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో మరుసటి రోజు మధ్యాహ్నం ఆ వీడియోను తొలగించారు.

కూతురి విషయంలో తండ్రిగా హర్రిస్ ప్రవర్తిస్తున్న తీరును ట్విట్టర్ యూజర్లు ఏకిపారేశారు. కూతురికి కన్యత్వ పరీక్ష చేసిన ఇలాంటి తండ్రిని కఠినంగా శిక్షించాలని తిట్టిపోశారు. కుమార్తె హైమెన్ పొరను పరీక్షించడాన్ని తప్పుబట్టారు. ఈ విషయంలో తండ్రికి సహకరించిన వైద్యుడి లైసెన్స్ కూడా రద్దు చేయాలని ట్విట్టర్ యూజర్లు డిమాండ్ చేశారు.

లైంగిక చర్య లేకుండానే హైమెన్ పొర దానింతటే అదే చిరిగిపోతుందని, కన్యత్వాన్ని రుజువుచేసేందుకు ఇలాంటి పని సరైనది కాదని నెటిజన్లు మండిపడ్డారు. 39ఏళ్ల ర్యాపర్.. 2009లో స్మగ్లర్ల నుంచి అక్రమ ఆటోమాటిక్ ఆయుధాన్ని కొనేందుకు ప్రయత్నించి అరెస్ట్ అయ్యాడు.