ఎంపీలు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు లక్ష్యంగా హానీట్రాప్ చేసే ముఠా అరెస్ట్

ఎంపీలు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు లక్ష్యంగా హానీట్రాప్ చేసే ముఠా అరెస్ట్

using Fake FB profiles,telegram chanels, Honey trap rocket busted mumbai police, to target MLAs, MPs and journalists into paying hush money : సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు లక్ష్యంగా చేసుకుని వారిని స్త్రీలోలురుగా అపఖ్యాతి చేసేందుకు ప్రయత్నం చేసే ముఠాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలవారిని బెదిరించి, వారి వద్దనుంచి ఈ ముఠా లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఈ ముఠాలో రాజస్ధాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముగ్గుర్ని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ముఠా మహిళల పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఎకౌంట్లు ఓపెన్ చేస్తుంది. ఎంపీలు,ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులకు ముందుగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. వారు యాక్సెప్ట్ చేసిన తర్వాత వారితో చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకుంటారు. వారి పర్సనల్ ఫోన్ నెంబర్ తీసుకుని అందులో వాట్సప్ చాటింగ్ చేస్తారు. వారాంతాల్లో వారికి వాట్సప్ వీడియో కాల్స్ చేసి మరింత దగ్గరవుతారు.

కొంతకాలం వారితో సరదాగా మాట్లాడినట్లు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వారితో శృంగార సంభాషణలు చేస్తారు. కాస్త నమ్మకం కలిగేలా చేసి వారికి పోర్న్ వీడియోలు పంపి, వీడియో కాల్ చేసి అవి చూసేలా ఆకర్షిస్తారు. పోర్న్ వీడియోలు చూసే సమయంలో వారి ముఖ కవళికలను మాటలను వారికి తెలియకుండా రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ వీడియోలను ఎడిట్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయటం మొదలెడతారు.

ఈవీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తారు. వారిని అపఖ్యాతి పాలు చేస్తామని బెదిరిస్తూ వారి వద్దనుంచి డబ్బులు డిమాండ్ చేస్తారు. మొదట్లో తక్కువ మొత్తం డిమాండ్ చేస్తారు. ఆతర్వాత పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయటం మొదలెడతారు. ఈ గ్యాంగ్ 171 నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు, నాలుగు టెలిగ్రామ్ ఛానల్ లు, 54 మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసిన తర్వాత వీరికి సంబంధించిన 58 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు.