Viral Video : క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన మహిళపై ఎఫ్ఐఆర్

ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక మహిళ క్యాబ్ డ్రైవర్ ను కొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Viral Video : క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన మహిళపై ఎఫ్ఐఆర్

Lucknow Woman Who Thrashed Cab Driver

Viral Video : ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక మహిళ క్యాబ్ డ్రైవర్ ను కొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న జీబ్రా క్రాసింగ్ దాటుతున్న సమయంలో ఆరోడ్డులో వెళుతున్నక్యాబ్ డ్రైవర్ ఆమెను చూసి కారు ఆపి వేశాడు.  కారు ఆమె ముందు ఆగటంతో మహిళ కోపంతో క్యాబ్ డ్రైవర్ వద్దకు వచ్చి కిందకు దింపి డ్రైవర్ ను పలుమార్లు చెంపదెబ్బలు కొట్టింది.

ఆ సమయంలో డ్రైవర్ తప్పులేకపోయినా మహిళ అనవసరంగా క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసింది.  ఆ మహిళ, క్యాబ్ డ్రైవర్ ను కొట్టకుండా ఆపుదామని ప్రయత్నించిన కానిస్టేబుల్ ప్రయత్నం కూడా వృధా అయ్యింది. మహిళ, కానిస్టేబుల్ మాటలు కూడా లెక్కచేయలేదు. ఈ దృశ్యాన్నంతా రికార్డు చేస్తున్నవ్యక్తి మహిళ దుర్మార్గమైనది అంటూ వ్యాఖ్యానించాడు.

ఆమె దాడి చేసే సమయంలో క్యాబ్ డ్రైవర్ ఫోన్ ధ్వంసం అయ్యింది. పోలీసులను  పిలవండి నా ఫోన్ కూడా ఆమె పగల గొట్టిందని క్యాబ్ డ్రైవర్ ఆవేదనగా అనటం కూడా ఆ వీడియోలో ఉంది.  కొన్నిసార్లు డ్రైవర్ చొక్కా కాలర్ పట్టుకుని లాగి, అతడి ముఖంమీద అనేక సార్లు కొట్టింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఈ ఘటన జులై 30వ తేదీ  రాత్రి 9గంటల 41 నిమిషాల సమయంలో లక్నోలోని కేసరి ఖేడా ట్రాఫిక్ క్రాసింగ్ వద్ద జరిగినట్లు సీసీటీవీ ఫుటేజి  ద్వారా తెలుసుకున్నారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. మహిళ రోడ్డు దాటుతుండగా క్యాబ్ డ్రైవర్  ఆమె ముందు ఆపాడు.  దీంతో మహిళ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ డ్రైవర్ ను కొట్టింది.

చుట్టుపక్కల బాటసారులు జోక్యం చేసుకోటానికి  ప్రయత్నించినప్పుడు మహిళ వారిని  కూడా కొట్టి వాగ్వాదానికి దిగింది. ఈ ఘటనకు ముందు జరిగిన పరిణామాలకు  సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో క్యాబ్ డ్రైవర్ వేగంగా వెళ్తున్నాడని, జీబ్రా క్రాసింగ్‌పై రోడ్డు దాటుతున్న మహిళను చూసి బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది.

క్యాబ్ డ్రైవర్ ట్రాఫిక్ లైట్   రెడ్ గా   ఉన్నప్పటికీ సిగ్నల్‌ని   కట్ చేయడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. మరికొందరు ఒక సిగ్నల్ గ్రీన్  ఉన్నప్పుడు ఆ మహిళ రోడ్డు దాటిందని ఆరోపించారు.  వాస్తవానికి అక్కడ ఉన్న సిగ్నల్   ఫ్రీ లెఫ్ట్   చూపిస్తుండంగా  వాహనాలు వేగంగా వెళుతుండగా  మహిళ రోడ్డు   దాటటానికి  ప్రయత్నించినట్లు వీడియోలో ఉంది. బాధితుడి ఫిర్యాదు మేరకు మహిళపై పోలీసులు కేస్ ఫైల్ చేశారు.