సినిమాల్లో పోలీసు వేషాలు..నిజజీవితంలో కార్ల చోరీలు..నటుడి గుట్టు బైటపెట్టిన పోలీసులు

  • Published By: nagamani ,Published On : June 22, 2020 / 05:29 AM IST
సినిమాల్లో పోలీసు వేషాలు..నిజజీవితంలో కార్ల చోరీలు..నటుడి గుట్టు బైటపెట్టిన పోలీసులు

సినిమాల్లో పోలీస్ వేషం అంటే ఎంత పవర్ ఫుల్లో తెలిసిన విషయమే. అటువంటి పవర్ ఫుల్ క్యారక్టర్లు వేసిన ఓ వ్యక్తి రీల్ లైఫ్ లో హీరో..రియల్ లైఫ్ లో దొంగగా మారాడు. సినిమాల్లో దొంగల్ని పట్టుకోవటంలో ఆరితేన పాత్రలో జీవించిన ఓ నటుడు రియల్ లైఫ్ లో కాస్ట్లీ కార్లపై కన్నేశాడు. ఖరీదైన కార్లను టార్గెట్ గా చేసుకుని ముఠాతో కలిసి కార్లు కొట్టేశాడు. చివరికి కటకటాలపాలయిన ఘటన యూపీలో జరిగింది.  

గత కొంత కాలంగా వరుసగా కార్లు చోరీకి గురౌతున్నాయి. అవికూడా కాస్ట్లీ కార్లు. వీటిపై కార్ల యజమానులు  కేసు నమోదు చేయటంతో లక్నో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు పక్కా ప్లాన్ తో కార్లు కొనేవారిగా అవతారమెత్తారు. కార్లు దొంగతనం చేస్తున్న ముఠాను బైటకు రప్పిందుకు సెకండ్ హ్యాండ్ కార్లు కొంటామని ప్రకటించారు.  వారి పాచిక పారింది. కార్ల ముఠా కలుగులోంచి బైకొచ్చింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ కార్ల ముంఠాలో భోజ్పూరి నటుడు నాసిర్ కూడా ఉన్నాడు. 

నాసిర్ మూడు  (ముకద్దర్, బాఘి ఏక్ యోధా, ముకాద్దర్ కా సికాందర్) భోజ్ పురి సినిమాల్లో పోలీస్‌గా నటించాడు. అతను నిజ జీవితంలో దొంగగా మారడం చూసి పోలీసులతో పాటు ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురి నుంచి రూ. 5కోట్ల విలువైన 50కార్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఇలా దొంగలించిన కార్లను ముఠా సభ్యులు మరమత్తు చేసి..కార్ల నంబర్లు మార్చేసి..వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మేస్తుంటారని లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ పాండే తెలిపారు. యూపీ,నేపాల్,బీహార్, ఢిల్లీ, హరియాణా ప్రాంతాల్లో వీరు పలు కాస్ట్లీ కార్లు దొంగతనాలు చేశారని..అరెస్టయిన వారిలో లక్నోకు చెందిన మొయినుద్దీన్ ఖాన్, వినయ్ తల్వార్, కాన్పూర్ కు చెందిన శ్యామ్ జీ జైస్వాల్ ఉన్నారని తెలిపారు.

అలాగే ఈ ముఠాలో రిజ్వాన్ అనే 50 వ్యక్తి కార్ల దొంగతనం ద్వారా సంపాదించిన డబ్బుతో ఓ హోటల్ కూడా కొన్నాడని తెలిపారు. అలాగే ఈ ముఠాలో మరో ఎనిమిదిమంది పరారీలో ఉన్నారనీ..వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. కొట్టేసిన లగ్జరీ కార్లను తిరిగి అమ్మటానికి ఈ ముఠా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని..వీటిలో బీమా సంస్థల పాత్ర కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నామని వారిని కూడా విచారిస్తామని తెలిపారు. 

Read: police ఇన్సెక్టర్ నని యువతిని నమ్మించి..లక్షలు దోచేసిన ఘరానా బుల్లోడు