Sexual Molested On Model : మోడల్‌కు మత్తు డ్రింక్ ఇచ్చి, నగ్న వీడియోలు తీసి, బ్లాక్ మెయిల్ చేసిన మహిళ

ఉత్తరప్రదేశ్‌లో  దారుణం చోటు  చేసుకుంది.  మహిళకు మహిళే శత్రువు అన్నట్లు... వర్ధమాన మోడల్‌ను నగ్నంగా వీడియో తీసి ఒక మహిళా నిర్మాత  బ్లాక్ మెయిల్ చేసిన  వెలుగు చూసింది.

10TV Telugu News

Sexual Molested On Model :  ఉత్తరప్రదేశ్‌లో  దారుణం చోటు  చేసుకుంది.  మహిళకు మహిళే శత్రువు అన్నట్లు… వర్ధమాన మోడల్‌ను నగ్నంగా వీడియో తీసి ఒక మహిళా నిర్మాత  బ్లాక్ మెయిల్ చేసిన  వెలుగు చూసింది.

సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో ఛాన్స్ లు  ఇప్పిస్తానని  వైష్ణవి ఫిల్మ్  ప్రొడక్షన్స్ కు    చెందిన  దియావర్మ అనే మహిళ,  బాధిత వర్ధమాన మోడల్‌ను  సంప్రదించింది.  అందుకు అంగీకరించిన మోడల్   విభూతి‌ఖండ్ పోలీసు స్టేషన్ పరిధిలోని  ఒక గెస్ట్ హౌస్   వద్దకు   స్క్రీన్ టెస్ట్‌కు హాజరయ్యింది.  అక్కడకు వెళ్లిన మోడల్‌కు దియావర్మ,  అనూప్ ఓజా, వరుణ్ తివారీ, ఆయుష్ మిశ్రా, ప్రియా మిశ్రా, సందీప్ విశ్వకర్మలను తన సహచరులుగా చెబుతూ పరిచయం చేసింది.

అప్పుడు ఆమెకు మత్తుమందు   కలిపిన  కూల్ డ్రింక్ ఆఫర్  చేశారు. మోడల్  వారు ఇచ్చిన ఆ డ్రింక్ తాగింది. ఫోటో షూట్  చేద్దామని  చెప్పి  ఓ డ్రెస్ ఇచ్చి,  వేరే గదిలోకి  పంపించి డ్రస్ మార్చుకు  రమ్మనమని  చెప్పారు. వారు చెప్పినట్లు మోడల్ వేరే  గదిలోకి  డ్రస్ తీసుకు వెళ్లింది.  ఆ గదిలో   డ్రస్ మార్చుకుంటున్నప్పుడు ఆమెకు  తెలియకుండా  వీడియో, ఫోటోలు తీశారు.  ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోలు ఫోటోలు చూపించి  అశ్లీల  సినిమాల్లో  నటించమని  ఒత్తిడి  చేశారు.  అందుకు ఆమె అంగీకరించలేదు.

Also Read : Minor Girl Pregnant : మైనర్ బాలికను గర్భవతిని చేసిన మైనర్ బాలుడు

నువ్వు  నటించకపోతే  ఈ వీడియోలను యూట్యూబ్‌లో  అప్‌లోడ్  చేస్తామని బెదిరించారు. అయినా ఆమె ఒప్పుకోలేదు.  రూ. 5లక్షలు  ఇస్తే వీడియోలు, ఫోటోలు ఇస్తామని  వారు ఆమెతో బేరం పెట్టారు. అది కూడా ఇచ్చుకోలేని   ఆమె  వీడియోలను డిలీట్  చేయాలని కోరింది.

ఆమె డబ్బులు ఇవ్వకపోవటంతో  మోడల్ నగ్న వీడియోలను యూట్యూబ్ లో అప్‌లోడ్  చేశారు. రూ.5లక్షలు ఇస్తేనే డిలీట్  చేస్తామని తేల్చి చెప్పారు. బాధితురాలు డబ్బులు ఇవ్వకపోవటంతో నిందితులు ఆమెను డబ్బులు కోసం వత్తిడి  చేయసాగారు.  దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై ఐపీసీలోని  పలు  సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి  దర్యాప్తు  చేస్తున్నామని  విభూతిఖండ్ పోలీసు స్టేషన్ అధికారులు తెలిపారు.