Uttarakhand : పాముపై కూల్‌డ్రింక్ పోసి స్నాక్ తిన్నట్లుగా తలను కొరికి నమిలేసిన యువకుడు .. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ఓ యవకుడు పాముని కసకసా నమిలేశాడు. రక్తంకారుతున్న పాముపై కూల్ డ్రింక్ పోసుకుని ఏదో స్నాక్ తిన్నట్లుగా నమిలేశాడు.

Uttarakhand : పాముపై కూల్‌డ్రింక్ పోసి స్నాక్ తిన్నట్లుగా తలను కొరికి నమిలేసిన యువకుడు .. ఆ తరువాత ఏం జరిగిందంటే..

man killed snake chewing head

man killed snake chewing head : అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుగా ఓ యువకుడు ఓ పాము తలను కసకసా కొరికేశాడు. ఇదంతా ఎవరిమీదో ఉన్న కోపాన్ని పాపం ఓ పాముపై చూపించాడు. పామును పట్టుకుని కసకసా తలను కొరికేశాడు.అక్కడున్న వారంతా లబోదిబోమన్నా..ఛస్తావేమోరా అంటూ హెచ్చరించినా అతని కోపం తగ్గలేదు. ఇదంతా ఎవరిమీద కోపం అని అనుకుంటున్నారా? తన ఇల్లు తొలగిస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో అదే సమయంలో అక్కడికి వచ్చిన పాము తలను కొరికేశాడు. కానీ పాపం అతని కోపానికి ఏమన్నా ప్రతిఫలం దక్కిందా అంటే అదీలేదు. పైగా అతనిపై కేసు కూడా నమోదు చేశారు వన్యప్రాణి చట్టం కింద. అంతేకాదు అతగాడిని జైలుకు పంపించారు అధికారులు. దీంతో అతగాడి పరిస్థితి ‘తన కోపమే తన శత్రువు’ అన్నట్లుగా అయిపోయింది.

అసలు విషయం ఏమిటంటే..ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో మే 18న నగీనా కాలనీలోని లాల్కువాన్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో రైల్వే అధికారులు ఆక్రమణల పేరుతో కొన్ని ఇళ్లను తొలగిస్తున్నారు. దీంతో మా ఇళ్లు ఎందుకు తొలగించొద్దు అంటూ అధికారులను ప్రశ్నించాడు. ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించారని అందుకే తొలగిస్తున్నామని తెలిపారు. దానికి అతను అడ్డుకున్నాడు. అయినా అధికారులు వినకుండా వారి పని వారు చేసుకుపోవటంతో సదరు యువకుడు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో కోపం నషాళానికి అంటింది. అంతే ఆక్రమణలు తొలిస్తున్న క్రమంలో ఎక్కడినుంచో అటువైపుగా ఓ పాము వచ్చింది.అంతే అధికారులపై కోపం ఆ పాముమీద చూపించాడు. దాన్ని అమాతం పట్టేసుకుని నోటిలో పెట్టుకుని దాని తల కొరికేశాడు. అతనుచేస్తున్న పనికి షాక్ అయిన అక్కడివారు పెద్ద పెద్ద కేకలు వేస్తు వారించారు. కానీ అతని కోసం తగ్గలేదు. తల కొరికేయటంతో పాము శరీరం నుంచి రక్తం కారుతోంది. అది చూసిన అక్కడే ఉన్న ఓ కూల్ డ్రింక్ షాపు (ఆక్రమణల తొలగింపులో షాపులు కూడా ఉన్నాయి)లోంచి ఓ డ్రింక్ తీసుకొచ్చి ఆ పాముపై పోసి మరోసారి కొరికేశాడు. ఏదో స్నాక్ తిన్నట్లుగా దానిపై కూల్ డ్రింక్ పోసిన మళ్లీ మళ్లీ కొరికాడు. అతని కోపాని పాపం ఆ పాము బలైపోయింది. చనిపోయింది.

ఎంతవారించినా అతను వినకపోవటంతో అధికారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దాంతో వారు వచ్చి వన్యప్రాణిని అనవసరం చంపాడని కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స తరువాత జైలుకు పంపించారు. అతను ఎందుకలా చేశాడో తెలియలేదని బహుశా ఇల్లు కోల్పోతున్నామని బాధలో అలా చేసి ఉంటాడని కానీ ఎలా చేసినా ఎందుకు చేసినా వన్యప్రాణిని అలా దారుణంగా కొరికి చంపేయటం నేరమని అందుకే అతనిపై కేసు నమోదు చేశామని ఫారెస్ట్ రేంజ్ అధికారి చందన్ సింగ్ తెలిపారు. అతనికి 34 ఏళ్లు ఉంటాయని అతనికి ఎటువంటి గుర్తింపు  కార్డు కూడా లేదని తెలిపారు.