Vaishali Kidnap Case : వైశాలి నా మనిషి అనుకుని ఎన్నో చేశా.. కస్టడీ‎లో కీలక విషయాలు వెల్లడించిన నవీన్ రెడ్డి

వైశాలిపై ఎంతో ప్రేమ పెంచుకున్నట్లు పోలీసులతో చెప్పిన నవీన్ రెడ్డి.. ఎలాగైనా ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించానన్నాడు. అందులో భాగంగానే వైశాలిని కిడ్నాప్ చేశానని ఒప్పుకున్నాడు నవీన్ రెడ్డి.

Vaishali Kidnap Case : వైశాలి నా మనిషి అనుకుని ఎన్నో చేశా.. కస్టడీ‎లో కీలక విషయాలు వెల్లడించిన నవీన్ రెడ్డి

Vaishali Kidnap Case : పోలీసు కస్టడీలో నవీన్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. వైశాలిపై ఎంతో ప్రేమ పెంచుకున్నట్లు పోలీసులతో చెప్పిన నవీన్ రెడ్డి.. ఎలాగైనా ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించానన్నాడు. అందులో భాగంగానే వైశాలిని కిడ్నాప్ చేశానని ఒప్పుకున్నాడు నవీన్ రెడ్డి.

వైశాలికి నచ్చ చెప్పాలని భావించానని, అయితే ఆమెను వాళ్ల తల్లిదండ్రులు హౌస్ అరెస్ట్ చేశారన్నాడు. అందుకోసమే ఆమెకు పెళ్లి గురించి నచ్చ చెప్పలేకపోయానన్నాడు. ఆమె కదలికలను గమనించేందుకు వైశాలి ఇంటి ముందు టెంట్ వేశానని, ఎంగేజ్ మెంట్ జరుగుతున్న విషయం తెలుసుకుని కిడ్నాప్ చేసినట్లు చెప్పాడు.

Also Read..Adibatla Kidnap Case : ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి నేరచరిత్రపై ఆరా, గతంలో రెండు కేసులు నమోదు

కిడ్నాప్ అనంతరం పెళ్లి చేసుకోవాలని ఎంతో ప్రాథేయపడ్డానని, ఆమె ఒప్పుకోకపోవడంతో స్వల్పంగా కొట్టానని చెప్పాడు. వైశాలికి హాని తలపెట్టాలని కలలో కూడా అనుకోలేదని, ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నట్లు తెలిసి స్నేహితుడి సాయంతో మన్నెగూడలో వైశాలిని డ్రాప్ చేయించానన్నాడు. ఆమెకు హాని తలపెట్టే ఉద్దేశం ఉంటే, తనతో తీసుకెళ్లే వాడిని కాదన్నాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

వైశాలిని తన మనిషి అనుకుని ఎన్నో చేశానన్నాడు. తల్లిదండ్రుల ఒత్తిడితోనే వైశాలి మారిందని, ఆర్థికంగా వైశాలి కుటుంబానికి ఎంతో సాయం చేశానని, పరిస్థితులు ఇంతవరకు వెళ్తాయని ఊహించలేదని పోలీసుల విచారణలో నవీన్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు.

Also Read..Vaishali Kidnap Remand Report : పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్.. వైశాలి అపహరణ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

నిన్న నవీన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఆదిభట్ల పోలీసులు.. కిడ్నాప్ కు సంబంధించి ప్రశ్నలు వేసి వివరాలు ఆరా తీశారు. కిడ్నాప్ చేసిన విధానంపై ఇవాళ సీన్ రీ-కన్ స్ట్రక్షన్ చేశారు. అలాగే గతంలో నవీన్ రెడ్డిపై ఉన్న కేసుల వివరాలను కూడా పోలీసులు రాబడుతున్నారు. ఇద్దరి మధ్య పరిచయం, ఆర్థిక వ్యవహారాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు.