కరోనాకి మందు కనిపెట్టటానికి బైక్ దొంగతనం…!

కరోనాకి మందు కనిపెట్టటానికి బైక్ దొంగతనం…!

వెనుకటి కెవడో తాటి చెట్టుఎందుకెక్కావురా అంటే దూడ మేత కోసం అన్నాడుట…అట్టా ఉంది వారణాశిలోని ఈ దొంగ మాటలు. పార్క్ చేసి ఉన్న పల్సర్ బైక్ ను దొంగతనం ఎందుకు చేశావురా అంటే కరోనాకు మందు కనిపెట్టటానికి అన్నాడుట. పల్సర్ బైక్ దొంగిలించిన దొంగను పోలీసులు 20 నిమిషాల్లో పట్టుకున్నారు.

ఉత్తర ప్రదేశ్, వారణాశిలోని లక్సా ప్రాంతంలో గురువారం జూన్ 25, రాత్రి ఒక ఫంక్షన్ హాలు ముందు పార్క్ చేసిన పల్సర్ బైక్ దొంగతనానినికి గురైంది. ఇది గమనించిన యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలర్టైన పోలీసులు వెంటనే వైర్ లెస్ సెట్లలో సమాచారాన్ని నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లకు చేరవేశారు. పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

bike robbary

దొంగిలించిన పల్సర్ వాహనంపై నడేసర్ ప్రాంతంలో ఒక వ్యక్తి వెళ్లటం గమనించి పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. లక్సా నివాసి రాహుల్ యాదవ్ గా పోలీసులు అతడిని గుర్తించారు. పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్లి అతడిని విచారణ చేయసాగారు. సరైన సమాధానాలు చెప్పకుండా రాహుల్ పోలీసులను ఇబ్బందులకు గురిచేశాడు.

దొంగతనం ఎందుకు చేశావని ప్రశ్నిస్తే…కరోనా వైరస్ కు తాను మందుకనిపెడుతున్నానని…. పరిశోధనల కోసం డబ్బులు తగ్గాయని…. అందుకని బైక్ దొంగతనంచేశానని చెప్పటంతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడి పూర్తి వివరాలు తెలుసుకుంటే రాహుల్ యాదవ్ పాతనేరస్ధుడని తేలింది. గతంలో అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాంట్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Read: బావతో అక్రమ సంబంధం… భర్త హత్య