Mumbai: ఆత్మహత్య చేసుకునేందుకు ఆరో ఫ్లోర్ నుంచి దూకిన వ్యక్తి.. అయినా సేఫ్.. అదెలాగంటే!

ఆత్మహత్య చేసుకునేందుకు ప్రభుత్వ బిల్డింగ్ పైకి ఎక్కాడో వ్యక్తి. ఆరో ఫ్లోర్ నుంచి ఏకంగా కిందికి దూకేశాడు. అయితే, అతడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రస్తుతం అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Mumbai: ఆత్మహత్య చేసుకునేందుకు ఆరో ఫ్లోర్ నుంచి దూకిన వ్యక్తి.. అయినా సేఫ్.. అదెలాగంటే!

Mumbai: మహారాష్ట్ర, ముంబై నగరంలో ఒక వ్యక్తి బిల్డింగ్ ఆరో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయినప్పటికీ అతడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన ముంబైలోని, మంత్రాలయ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులో గురువారం జరిగింది.

Elon Musk: ట్విట్టర్‌కు త్వరలో కొత్త సీఈవో.. పదవికి గుడ్ బై చెప్పనున్న ఎలన్ మస్క్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆరో ఫ్లోర్ చేరుకుని, అక్కడి నుంచి కిందికి దూకాడు. అయితే, కింద రక్షణగా బలమైన నెట్ ఏర్పాటు చేశారు. బిల్డింగ్ పై నుంచి దూకిన వ్యక్తి నెట్‌లో పడటం వల్ల అతడికి ఏమీ కాలేదు. సురక్షితంగా ఉన్నాడు. వెంటనే అక్కడున్న వ్యక్తులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. వాళ్లు నెట్‌లో చిక్కుకున్న వ్యక్తిని రక్షించి, బయటకు తీశారు. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అనుకున్నాడో చెప్పాడు. అతడు చెప్పిన వివరాల ప్రకారం.. తన ప్రేయసి కొంతకాలం క్రితం అత్యాచారానికి గురైంది. దీని గురించి ఎవరికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు.

Lucknow: పేరెంట్స్-టీచర్ మీట్ ఏర్పాటు చేశారని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

నిందితులపై చర్యలు తీసుకోలేదు. దీంతో అప్పట్లో సీఎం ఉద్ధవ్ థాక్రేకు కూడా లేఖలు రాశాడు. అయినా స్పందన లేదు. చివరకు విసుగు చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు అతడు చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.