Bobby Kataria: విమానంలో స్మోకింగ్ చేసిన బాబీ కటారియా.. స్పందించిన ఏవియేషన్ మంత్రి.. వీడియో వైరల్

నిబంధనలకు విరుద్ధంగా విమానంలో సిగరెట్ వెలిగించుకున్నాడు బాబీ కటారియా. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరుపొందిన అతడి అనుచిత, బాధ్యతారాహిత్య ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

Bobby Kataria: విమానంలో స్మోకింగ్ చేసిన బాబీ కటారియా.. స్పందించిన ఏవియేషన్ మంత్రి.. వీడియో వైరల్

Bobby Kataria: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరుపొందిన బాబీ కటారియా.. విమానంలో స్మోకింగ్ చేసిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. హరియాణాకు చెందిన బల్విందర్ కటారియా అలియాస్ బాబీ కటారియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపు ఆరున్నర లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Karnataka High Court: పెళ్లైన కూతుళ్లకూ తల్లిదండ్రుల ఇన్సూరెన్స్‌లో వాటా: కర్ణాటక హై కోర్టు

అయితే, అతడు చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గత జనవరి 23న దుబాయ్-ఢిల్లీ వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో అతడు పడుకుని సిగరెట్ వెలిగించుకుని తాగాడు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. విమానంలో అనుచితంగా, బాధ్యతారహితంగా ప్రవర్తించిన అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు, విమానయాన శాఖా మంత్రి జ్యోతిరాధిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై జ్యోతిరాధిత్య సింధియా స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యుడిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. గతంలో కూడా బాబీ కటారియా పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇటీవల డెహ్రడూన్ రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని మందు తాగాడు.

Karnataka High Court: పెళ్లైన కూతుళ్లకూ తల్లిదండ్రుల ఇన్సూరెన్స్‌లో వాటా: కర్ణాటక హై కోర్టు

దీనికి సంబంధించిన వీడియోను కూడా అతడు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉత్తరాఖండ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విమానంలో స్మోకింగ్ ఘటనకు సంబంధించి.. విమానాల్లో స్మోకింగ్ చేయడం నిషేధం. పైగా దీని కోసం నిప్పు వెలిగించడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. దీనివల్ల వందల మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందుకే అతడిపై చర్యలు తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు.