అమెరికాలో మరో దారుణం…వృద్ధుడిపై పోలీసుల క్రూరత్వం

  • Published By: venkaiahnaidu ,Published On : June 5, 2020 / 10:23 AM IST
అమెరికాలో మరో దారుణం…వృద్ధుడిపై పోలీసుల క్రూరత్వం

మిన్నియాపొలిస్ సిటీ పోలీసుల పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుడు “జార్జ్‌ ఫ్లాయిడ్‌(46)”కి మద్దతుగా అమెరికాలో ఆఫ్రో-అమెరికన్లు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. 10 రోజులుగా అగ్రరాజ్యంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం కూడా నిరసనలు కొనసాగాయి. ఈ క్రమంలో నిరసనలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన న్యూయా రాష్ట్రంలోని బఫెలో సిటీ పోలీసులు… ఓ సీనియర్ సిటిజన్ ను తోసేసిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

 స్థానిక పబ్లిక్ రేడియో స్టేషన్ WDFOకి చెందిన ఓ రిపోర్టర్ తీసిన ఈ వీడియోలో…నిరసన తెలుపుతున్న 75ఏళ్ల వయస్సు ఉన్న ఓ తెల్ల జుట్టు వ్యక్తి బఫెలో పోలీసుల కవాతుకు అడ్డుగా వచ్చి ఏదో చెప్పబోయాడు. దాంతో కవాతులోని ఓ పోలీసు అతన్ని లాఠీతో నెట్టేశాడు. మరో పోలీసు కూడా చేత్తో బలంగా తోయడంతో అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. అతను బలంగా నేలను తాకడంతో తలకు బలమైన గాయమై రక్తం స్రావమైంది. అయినప్పటికీ ఆ పోలీసులు కనికరించలేదు. అతనిపై దాడికి యత్నించారు.

అంతలోనే మిగతా పోలీసులు వారిని వారించి అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు రికార్డ్ అయింది. సమీపంలో ఉన్న మెడికల్‌ సిబ్బంది స్పందించి ఆ వృద్ధ నిరసకారుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారని WDFO తెలిపింది. యపడిన వ్యక్తి పరిస్థితి నిలకడ ఉందని తెలిపింది. కాగా,ఈ ఘటనపై బఫెలో మేయర్ బైరోన్ బ్రౌన్ స్పందించారు. ఈ వీడియో చూసి తాను చాలా బాధపడినట్లు తెలిపారు.

శాంతియుత నిరసనలు…పోలీసులు,తనకు,కమ్యూనిటీ సభ్యులకు మధ్య పలు సమావేశాలు తర్వాత జరిగిన ఈ ఘటన తనను చాలా బాధించిందన్నారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి సీరియస్ గా ఉందని,ఈరీ కౌంటీ మెడికల్ సెంటర్ హాస్పిటల్ లో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు బ్రౌన్ తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో..పోలీసుల క్రూరత్వాన్ని ఖండిస్తూ అమెరికాలోని పలు సిటీల్లో ఆందోళనకారులు తిరిగి రోడ్లపైకి నిరసనలకు దిగారు. వృద్ధుడిపై క్రూరంగా ప్రవర్తించిన ఇద్దరు పోలీసులు వేతనం లేని సస్పెన్షన్ కు గురయ్యారు.

Read:  సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘George Floyd Challenge’ హ్యాష్ ట్యాగ్