Visakha : బాలిక మృతి..కోర్టుకు నిందితుడు..ఏం శిక్ష విధిస్తారు ?

పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం సొంతూరిని వదిలేసి విశాఖకు వచ్చింది బాలిక కుటుంబం. అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది.

Visakha : బాలిక మృతి..కోర్టుకు నిందితుడు..ఏం శిక్ష విధిస్తారు ?

Vishaka

Visakha Gajuwaka : పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం సొంతూరిని వదిలేసి విశాఖకు వచ్చింది బాలిక కుటుంబం. అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న వారి కూతురిపై కన్నేశాడు నగేశ్‌. ఇందుకు ప్రేమను ఆయుధంగా వాడుకున్నాడు. అమాయకురాలైన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పాడు. మంచేదో.. చెడేదో తెలియక ఆ మాయగాడి మాటలు నమ్మింది బాలిక.

Read More : Pooja Hegde : ఆధ్యాత్మిక యాత్రలో బుట్టబొమ్మ

దీంతో ప్రేమంటూ హద్దులు దాటాడు. ఫోర్న్‌ వీడియోలు చూపిస్తూ లోబర్చుకున్నాడు. ఇలా పలుమార్లు బాలికతో సన్నిహితంగా గడిపాడు. తన కార్పెంటర్‌ పనులు పూర్తవ్వడంతో వెళ్లిపోయేముందు లాస్ట్‌గా కలుద్దామంటూ ఒత్తిడి చేశాడు. ఇదే బాలిక ప్రాణాలను బలితీసుకుంది. ఎక్కడి నుంచో వలస వచ్చిన కుటుంబంలో విషాదం నింపింది. బాలికను ట్రాప్‌చేసి ఆమె మృతికి కారణమైన నగేశ్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అతడిపై పోక్సోతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు.

Read More : Pakistan: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 20మంది మృతి.. 300మందికి గాయాలు

విశాఖ బాలిక అనుమానాస్పద మృతి మిస్టరీని ఛేదించారు పోలీసులు. ప్రేమ వ్యవహారమే బాలిక ప్రాణాలు బలి తీసుకున్నట్టు తేల్చారు. ప్రేమ పేరుతో బాలికను ట్రాప్‌చేసి… లోబర్చుకోవడమే ఆ బాలిక ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. తల్లిదండ్రులకు తెలిసిపోతుందన్న భయంతోనే బాలిక బిల్డింగ్‌పై నుంచి దూకి చనిపోయినట్టుగా తేల్చారు పోలీసులు.