Set Fire : విశాఖలో దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

విశాఖలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డుకు

Set Fire : విశాఖలో దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

Set Fire

Set Fire : విశాఖలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Urinate : మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళుతున్నారా?..కారణాలు తెలుసా?..

అమ్మాయిది విశాఖ కాగా, అబ్బాయిది వరంగల్. పంజాబ్‌లో కలిసి ఇంజినీరింగ్ చదువుకునేటప్పుడు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని యువకుడు ప్రేమించాలంటూ వేధించాడు. అందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp Feature: వాట్సప్‌లో కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్

అంతకుముందు నీతో మాట్లాడాలని అమ్మాయిని లాడ్జికి తీసుకెళ్లాడు యువకుడు. ప్రేమకు నిరాకరించడంతో తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను పోసి తగలబెట్టాడు. తర్వాత ఒంటిపై తను కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఆ ఉన్మాది.