Matrimonial Fraud : పెళ్లి పేరుతో డబ్బులు కాజేసి మోసంచేసిన యువతి

పెళ్లి చేసుకుంటానని మాటలు కలిపి దాదాపు ఏడాది పాటు చాటింగ్ చేస్తూ ఒక యువకుడి నుంచి లక్షరూపాయలు కాజేసిన యువతి ఉదంతం వెలుగుచూసింది.

Matrimonial Fraud : పెళ్లి పేరుతో డబ్బులు కాజేసి మోసంచేసిన యువతి

Matrimonial Fraud

Matrimonial Fraud :  పెళ్లి చేసుకుంటానని మాటలు కలిపి దాదాపు ఏడాది పాటు చాటింగ్ చేస్తూ ఒక యువకుడి నుంచి లక్షరూపాయలు కాజేసిన యువతి ఉదంతం వెలుగుచూసింది.  హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన యువకుడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో తన ప్రోఫైల్  మ్యాట్రిమోనియల్   వెబ్ సైట్ లో నమోదు చేసుకున్నాడు.

అతని ప్రోఫైల్ చూసి విజయనగరానికి చెందిన యువతి 9 నెలల క్రితం అతడ్ని పెళ్లి చేసుకోటానికి ఇష్టమే నని చెపుతూ మాటలు కలిపింది. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోవటం మొదలెట్టారు. కొన్నాళ్లకు వాళ్ల అమ్మతో కూడా మాట్లాడించి పెళ్లి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత వాట్సప్ లో చాటింగ్ లు చేసుకుంటూ వస్తున్నారు.

అనంతర కాలంలో మా అమ్మకు ఒంట్లోబాగోలేదు… ఆస్పత్రిలో చూపించాలి, డబ్బులు కావాలని అడిగి యువకుడి వద్దనుంచి పలు మార్లు డబ్బులు బ్యాంకు లో డిపాజిట్ చేయించుకుంది.  ఓసారి 30 వేలు, మరోసారి 20 వేలు చొప్పున మొత్తం రూ. 1.08 లక్షలు యువకుడి నుంచి తీసుకుంది.

పెళ్లి ఎప్పడు చేసుకుందామని యువకుడు అడుగుతుంటే దాటవేస్తూ వచ్చింది. గట్టిగా యువకుడు పెళ్లి విషయం నిలదీయటంతో తల్లి, కూతుళ్లు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. మోసపోయానని గ్రహించిన యువకుడు ఆదివారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదుచేసుకున్న పోలీసలు దర్యప్తు ప్రారంభించారు.