Vizianagaram : తల్లితో కలిసి రూ.3 కోట్ల చీటీ డబ్బులు తీసుకుని పారిపోయిన వార్డ్ వాలంటీర్

రోజు వారీ కూలీ చేసుకునే వారి వద్ద చీటీలు వేసి వారి డబ్బులతో ఉడాయించిన మహిళ ఉదంతం విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని సాలూరులో చిట్లు వీధిలో నివసించే మానాపురం అరుణ, ఆమె కూత

Vizianagaram : తల్లితో కలిసి రూ.3 కోట్ల చీటీ డబ్బులు తీసుకుని పారిపోయిన వార్డ్ వాలంటీర్

vizianagaram cheating

Vizianagaram :  రోజు వారీ కూలీ చేసుకునే వారి వద్ద చీటీలు వేసి వారి డబ్బులతో ఉడాయించిన మహిళ ఉదంతం విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని సాలూరులో చిట్లు వీధిలో నివసించే మానాపురం అరుణ, ఆమె కూతురు రమ్య చిట్టీల పేరుతో 15 సంవత్సరాలుగా చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నారు.

వీరు రోజువారీ కూలీ చేసుకునే వారు.. రోడ్డు మీద తోపుడు బళ్ళపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారుల వద్ద చీటీలు కట్టించారు. వీరిలో కుమార్తె  చిట్లువీధి ఉన్న వార్డుకు వాలంటీర్ గా పని చేస్తోంది. వీరు చీటీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా… ఎక్కవ వడ్డీ ఇస్తామని… చీటీ  పాడుకున్న వారికి ఆశచూపి ఆ డబ్బును వారి వద్దే ఉంచుకునేవారు.
Also Read : Youtuber Record: 42 సెకన్లలో కోట్లు సంపాదించిన యూట్యూబర్
వారిని నమ్మి చాలామంది వారి వద్ద రోజువారీ, వారం,నెలవారీ గా డబ్బులు దాచుకోవటం మొదలెట్టారు ప్రజలు. గత డిసెంబర్ నెలలో మానాపురం అరుణ కొంత మందికి డబ్బు చెల్లించాల్సి ఉండగా… వారికి డబ్బు ఇవ్వకుండా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు తల్లీ కూతుళ్ళు. 10 రోజుల క్రితం పెళ్ళికి వెళ్లి వస్తామని చెప్పి వెళ్ళిన వాళ్ళు వారం దాటినా రాకపోవటంతో బాధితులు మోసపోయామని గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలని అధికారులను పోలీసులను కోరుతున్నారు.