Bike Thieves Video viral: దొంగలు బైకును చోరీ చేసి పారిపోతుండగా.. మెరుపు వేగంతో స్పందించి గేటు వేసిన సెక్యూరిటీ గార్డ్

మునిసిపల్ అధికారులమంటూ ఇద్దరు వ్యక్తులు ఓ అపార్ట్ మెంటు గేటు తీసుకుని లోపలికి వచ్చారు. అనంతరం అక్కడ ఉన్న ఓ బైకును చోరీ చేసి, అక్కడి నుంచి బయటకు వేగంగా దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించి, మెరుపు వేగంతో స్పందించిన అక్కడి సెక్యూరిటీ గార్డ్ వెంటనే గేటు వేసేశాడు. దీంతో ఆ ఇద్దరు బైకు దొంగలు గేటుకు ఢీకొని కింద పడిపోయారు. అనంతరం స్థానికులు వచ్చి ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు.

Bike Thieves Video viral: దొంగలు బైకును చోరీ చేసి పారిపోతుండగా.. మెరుపు వేగంతో స్పందించి గేటు వేసిన సెక్యూరిటీ గార్డ్

Bike Thieves Video viral

Bike Thieves Video viral: మునిసిపల్ అధికారులమంటూ ఇద్దరు వ్యక్తులు ఓ అపార్ట్ మెంటు గేటు తీసుకుని లోపలికి వచ్చారు. అనంతరం అక్కడ ఉన్న ఓ బైకును చోరీ చేసి, అక్కడి నుంచి బయటకు వేగంగా దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించి, మెరుపు వేగంతో స్పందించిన అక్కడి సెక్యూరిటీ గార్డ్ వెంటనే గేటు వేసేశాడు. దీంతో ఆ ఇద్దరు బైకు దొంగలు గేటుకు ఢీకొని కింద పడిపోయారు. అనంతరం స్థానికులు వచ్చి ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు.

ఇద్దరు దొంగల్లో ఒకరు తప్పించుకు పారిపోయాడు. మరో కేటుగాడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్కాజీ ఎక్స్‌టెన్షన్ ఎవరెస్ట్ అపార్ట్ మెంట్స్ వద్ద చోటుచేసుకుంది. ఆ ఇద్దరు దొంగలు పారిపోతుండగా సెక్యూరిటీ గార్డు గేటు వేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.

సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఏ డెలివరీ బాయ్ అపార్ట్ మెంటులోని ఓ ఇంటికి వచ్చి బైకుకు తాళం వేయడం మర్చిపోయాడని, దాన్నే దొంగలు స్టార్ట్ చేసి, చోరీ చేయడానికి ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన డెలివరీ బాయ్ తన బైకును చోరీ చేసి పారిపోతున్నారంటూ గట్టిగా అరవడంతో సెక్యూరిటీ గార్డు గేటు వేశాడని వివరించారు.

Rain alert for Telangana: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం