బీ.ఫార్మశీ విద్యార్ధిని బలవన్మరణంలో గత రెండు వారాలుగా ఎప్పుడేం జరిగింది

బీ.ఫార్మశీ విద్యార్ధిని బలవన్మరణంలో గత రెండు వారాలుగా ఎప్పుడేం జరిగింది

What happened when the B.Pharmacy student committed suicide : బీ ఫార్మశీ విద్యార్ధిని కిడ్నాప్ వ్యవహారం అంతా ఫేక్‌ అని తేలడంతో యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం సంచలనం సృష్టించడం, పరువు పోవడం, బంధువులను, స్నేహితులను కలిసే పరిస్థితి లేకపోవడం యువతిని తీవ్రంగా వేధించాయి.

తన మూలంగా కుటుంబం పరువు కూడా పోయిందని యువతి ఆవేదన చెందింది. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు యువతిపై కేసు నమోదయింది. ఈ పరిస్థితుల్లో బయటకు తిరగలేనని భావించే.. ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఈనెల 24 వరకు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం

ఫిబ్రవరి 10:

1. సాయంత్రం అదృశ్యమైన యువతి

2. సాయంత్రం గం.7.30నిలకు యువతికి తల్లి ఫోన్

3. తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశారని చెప్పిన యువతి

4. పోలీసులకు యువతి తల్లి ఫిర్యాదు

5. యువతి ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసుల వేట

6. లొకేషన్ ఆధారంగా యువతిని గుర్తించిన పోలీసులు

7. ఘట్ కేసర్ ఆస్పత్రికి తరలింపు

8. నలుగురు ఆటోడ్రైవర్లు సామూహిక అత్యాచారం చేశారని యువతి ఫిర్యాదు

ఫిబ్రవరి 11

9. యువతిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలింపు

10. ఆటో డ్రైవర్లను ప్రశ్నించిన పోలీసులు

11. సీసీటీవీ దృశ్యాలు పరిశీలన

ఫిబ్రవరి 12

12. మరోసారి యువతిని ప్రశ్నించిన పోలీసులు

13. కిడ్నాప్ డ్రామా ఆడినట్టు యువతి అంగీకారం

ఫిబ్రవరి 13

14. యువతిపై కేసు నమోదు

15. ఆటోడ్రైవర్లకు రాచకొండ సీపీ క్షమాపణ

ఫిబ్రవరి 24

16. షుగర్ ట్యాబ్లెట్లు మింగి యువతి ఆత్మహత్య

ఈ ఎపిసోడ్ మొత్తంలో యువతి మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.