సుశాంత్ మృతికి.. డ్రగ్స్‌కి లింకేంటి?

  • Published By: sreehari ,Published On : August 27, 2020 / 08:39 PM IST
సుశాంత్ మృతికి.. డ్రగ్స్‌కి లింకేంటి?

Sushant Singh Rajput case: డ్రగ్స్.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ మీదకొచ్చిన టాపిక్. ఈసారి కూడా.. డ్రగ్ ఇష్యూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బ్లాస్ట్ అయ్యింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో.. ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ.. డ్రగ్ డోస్‌కి.. సినిమా స్కోప్‌కి లింకేంటి? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. డ్రగ్స్‌కి కేరాఫ్‌గా మారిందా? ఇదే.. ఇవాళ్టి వైడ్ యాంగిల్.

సుశాంత్ డెత్ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు సీబీఐ టేకోవర్ చేశాక.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటకొస్తున్నాయ్. అలా.. లేటెస్ట్‌గా డ్రగ్స్ ఇష్యూ బ్లాస్ట్ అయ్యింది. కంగనా రనౌత్ చేసిన ట్వీట్‌.. ఫిల్మ్ ఇండస్ట్రీలో థౌజండ్ వోల్ట్స్.. హీట్ పుట్టించింది. బాలీవుడ్‌లో కొకైన్ డ్రగ్ ఫేమస్ అంటూ కంగనా పేల్చిన డైలాగ్.. ఇండియా మొత్తం రీసౌండ్ వచ్చింది. ఇంతకీ.. సుశాంత్ మృతికి.. డ్రగ్స్‌కి లింకేంటి? కంగనా కామెంట్స్ వెనకున్న సీక్రెట్ ఏంటి?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తులో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎంటరైంది. రోజుకో మలుపుతో.. సుశాంత్ డెత్ కేసులో ఊహించని ట్విస్ట్‌లు బయటకొస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో.. డ్రగ్స్ లింక్ పెను దుమారమే రేపుతోంది. రియా చక్రవర్తి డెలీటెడ్ వాట్సాప్ చాట్స్‌లో 2017 నుంచి 2019 మధ్య హార్డ్ డ్రగ్స్, MDMAపై చర్చ జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ విషయాన్ని.. సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు తెలియజేసింది.

రియా చక్రవర్తికి.. డ్రగ్స్ డీలర్లకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్‌ని.. ఈడీ సీబీఐకి అందించింది. సుశాంత్‌ మృతి కేసు విచారణలోకి ఎంటరైన ఎన్‌సీబీ.. ఇప్పటికే కీలక పత్రాలను పరిశీలించింది. రియా, సుశాంత్‌కు డ్రగ్‌ సరఫరా జరిగినట్టు తాము చేపట్టిన దర్యాప్తులో తేలిందని ఈడీ స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని ఎన్సీబీకి అందించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయ్.



ఈ కేసుకు సంబంధించి.. ఎన్సీబీ ఢిల్లీలో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తిపై కేసు నమోదు చేసింది. డ్రగ్స్‌ కలిగి ఉండటం, కొనుగోలు చేయడం, వాడకం ఆరోపణలపై వీరిపై కేసులు బుక్ అయ్యాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరిని కూడా నార్కోటిక్స్ టీమ్ ప్రశ్నించనుంది.

సుశాంత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎంటరవడంతో.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బీ టౌన్‌లో డ్రగ్స్ వ్యవహారంపై కంగనా చేసిన ట్వీట్స్ సంచలనంగా మారాయి. డ్రగ్ ముఠాలతో.. బాలీవుడ్‌లోని కొందరి సంబంధాలపై NCB దర్యాప్తు చేస్తే.. కొందరు ప్రముఖులు జైలుకు వెళ్తారని.. కంగనా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.



నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్‌లో ప్రవేశిస్తే.. కొందరు ఏ లిస్టర్స్ జైలులో ఊచలు లెక్కబెడతారని ట్వీట్ చేసింది కంగనా. బాలీవుడ్‌లో కొందరికి బ్లడ్ టెస్ట్ చేస్తే.. అసలు విషయం బయటపడుతుందని కంగనా చేసిన ట్వీట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో హీట్ పుట్టిస్తోంది. స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద ప్రధాని కార్యాలయం.. బాలీవుడ్‌లోని బురదను ప్రక్షాళన చేస్తుందని ఆశిస్తున్నట్లు కంగనా చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొకైన్ చాలా పాపులర్ డ్రగ్ అని కంగనా ట్వీట్ చేసింది. ఇండస్ట్రీకి సంబంధించి.. ప్రతి ఇంట్లో జరిగే పార్టీలో కొకైన్ కచ్చితంగా ఉంటుందని చెప్పింది. సంపన్నులు, శక్తిమంతమైన వ్యక్తుల ఇళ్లకు వెళ్లినప్పుడు.. అక్కడ కొకైన్ ఫ్రీగానే దొరుకుతుందని తెలిపింది.



సుశాంత్ కేసు విషయంలో.. ఎన్సీబీకి సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది కంగనా రనౌత్. ఇందుకోసం.. తన కెరీర్‌తో పాటు జీవితాన్ని కూడా రిస్క్‌లో పెడుతున్నట్లు చెప్పింది. ఐతే.. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని ట్వీట్ చేసింది. సుశాంత్‌కు.. ఇలాంటి సీక్రెట్స్ చాలా తెలుసని.. అందుకే అతన్ని హత్య చేశారంటూ ఆరోపించింది కంగనా.

రియా, షోయిక్‌తో పాటు గౌరవ్ ఆర్య అనే పుణెకి చెందిన డ్రగ్ డీలర్‌ని కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించనుంది. రియా డ్రగ్స్ చాట్స్‌ని అనలైజ్ చేయనుంది. మరోవైపు రియా తరఫు లాయర్.. ఈ కేసుపై స్పందిస్తూ.. ఆమెకు అసలు డ్రగ్స్ అలవాటు లేనే లేదని చెప్పారు.



ఇప్పటివరకు రియా డ్రగ్స్ జోలికే పోలేదన్నారు. దీనిని నిర్ధారించేందుకు.. రియా చక్రవర్తి ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్‌కి సిద్ధమని తెలిపారు. డ్రగ్‌ డీలర్‌తో రియా జరిపిన చాటింగ్ బయటకు రావడంతో.. ఆమెను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.