Mumbai Porn Racket : పోర్న్ చిత్రాల కేసులో రాజ్‌కుంద్రా ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయి

పోర్న్ వీడియాలు తయారీ కేసులో అరెస్టైన సినీ నటుడు వ్యాపార వేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా, యూకే నివాసి ప్రదీప్ బక్షీ సంస్ధ కెన్రిన్ ప్రోక్షన్ హౌస్ తో కలిసి పని చేస్తున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.

Mumbai Porn Racket : పోర్న్ చిత్రాల కేసులో రాజ్‌కుంద్రా ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయి

Raj Kundra Porn Cinema Case

Mumbai Porn Racket :  పోర్న్ వీడియాలు తయారీ కేసులో అరెస్టైన సినీ నటుడు వ్యాపార వేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా, యూకే నివాసి ప్రదీప్ బక్షీ సంస్ధ కెన్రిన్ ప్రోక్షన్ హౌస్ తో కలిసి పని చేస్తున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. నిన్న అరెస్ట్ చేసిన రాజ్ కుంద్రాకు కోర్టు జులై 23వరకు రిమాండ్ విధించింది. రాజ్‌కుంద్రా, కెన్రిన్ ప్రోడక్షన్ హౌస్‌ల మధ్య జరిగిన వాట్సప్ మెసేజ్ చాట్‌లను పోలీసులు సేకరించారు. కెన్రిన్ ప్రోడక్షన్ హౌస్ మార్చి23. 2005 న ప్రారంభించబడింది. దీని రిజిష్టర్డ్ కార్యాలయం సర్రేలోని స్టెయిన్స్ అపాన్ థేమ్స్ లో ఉంది. నవంబర్ 1,2008న ప్రదీప్ బక్షి సంస్ధ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

సంస్ధలో 10మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్నప్పటికీ వీరి సోషల్ మీడియా యాప్ కు 2మిలియన్ల టర్నోవర్ ఉంది. సంస్ధ వీడియో ప్రోడక్షన్ కార్యకలాపాలు, టెలివిజన్ ప్రోగ్రామింగ్‌లో ఉంది. రాజ్‌కుంద్రా పరోక్షంగా ఈసంస్ధలో వ్యాపార భాగస్వామి మరియు పెట్టుబడిదారుడు అని పోలీసులు చెప్పారు. కుంద్రా వ్యక్తిగత సహాయకుడు ఉమేష్ కామత్ భారత్‌లోని కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధి అని, పోర్న్ చిత్రాల కోసం చాలా మంది ఏజెంట్లకు కాంట్రాక్టులు, నిధులు సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు.

కేసు దర్యాప్తులో నటి గెహనా వశిష్ట్, ఉమేష్ కామత్ పోర్న్ చిత్రాలు నిర్నించటంలో పాల్గోన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఇండియాలో పోర్న్ చిత్రాలు షూటింగ్ అయిన తర్వాత వాటిని యూకేలోని కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్‌కు ఒక అప్లికేషన్ ద్వారా పంపేవారు. అక్కడ ఆసినిమాలను ఎడిటింగ్, మిక్సింగ్ చేసి హాట్‌షాట్ అనే యాప్‌లో విడుదల చేసినట్లు పోలీసులు తేల్చారు.

కెన్రిన్ ప్రోడక్షన్ హౌస్ దేశవ్యాప్తంగా పలువురు ఏజెంట్ల ద్వారా పోర్న్ చిత్రాలకు నిధులు సమకూరుస్తున్నట్లు క్రైం బ్రాంచ్ అధికారులు గుర్తించారు. రాజ్‌కుంద్రా క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్‌కు సంబంధించిన సాక్ష్యాధ్యారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాట్సప్ గ్రూప్‌లో రాజ్‌కుంద్రాతో పాటు మరో నలుగురు సభ్యులుగా ఉన్నారు.

రాజ్‌కుంద్రా చేసిన వాట్సాప్ చాట్లలో, మార్కెటింగ్ వ్యూహం, అమ్మకాలు పెంచడం, మోడల్స్‌కు డబ్బులు చెల్లింపులు…. ఇతర ఒప్పందాల గురించి మాట్లాడారు. మరోక చాట్ మెసేజ్ లో… ప్రదీప్ బక్షి ఇలా వ్రాశాడు, “నాకు ఒక PSD ఫైల్ పంపండి మరియు మా డిజిటల్ ఆస్తుల ప్రకారం నేను వాటిని పరిమాణం చేస్తాను.” అని ఉంది.

అక్టోబర్ 20నాడు జరిగిన మరో చాట్‌లో ఇలా ఉంది, అంతకు ముందురోజు జరిగిన వ్యాపార లావాదేవీల లెక్కలు ఉన్నాయి. రాజ్‌కుంద్రా దీనికి సమాధానమిస్తూ,” సినిమా ఆదాయం నిజంగా పడిపోయింది. “అని అన్నారు. మరోక చాట్‌లో ఒక నటికి డబ్బులు చెల్లించక పోవటంపై ఫిర్యాదు చేసినట్లు ఉంది.

కాగా గెహనా వశిష్ట్, ఉమేష్ కామత్‌లు పోర్న్ చిత్రాలు తీసే పనిలో పడ్డారు. ఈ విషయాన్ని ఈమెయిల్ ఐడీ ద్వార్ కెన్రిన్ ప్రోడక్షన్ హౌస్‌కు మెయిల్ పంపారు. వారు పోర్న్ చిత్రాలు లింక్ పంపిన వెంటనే వారి ఖాతాలకు నగదు బదిలీ చేయబడింది. ఈ పోర్న్ సినిమాలు అప్పుడు సోషల్ మీడియా యాప్ హాట్‌షాట్‌లో అప్‌లోడ్ చేశారు.

పోర్న్ రాకెట్ కేసుపై దర్యాప్తులో నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాతో పాటు మరో నలుగురికి మధ్య సంబంధాలున్నాయని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి, వాట్సాప్ గ్రూపులో చేసుకున్న చాట్‌లో వారు అశ్లీల వీడియోల చెల్లింపులు మరియు ఉత్పత్తి మార్కెటింగ్ గురించి చర్చించారు.

ఈ కేసుకు సంబంధించి రాజ్ కుంద్రాను సోమవారం అరెస్టు చేశారు. మిగతా నలుగురిని ప్రదీప్ బక్షి, అకౌంట్స్ విభాగానికి చెందిన మేఘా వియాన్, రాబ్ డిజిటల్ మార్కెటింగ్ హాట్‌షాట్ మరియు హాట్ షాట్‌ల కంటెంట్ హెడ్ రా ఎవాన్స్ లు మాట్లాడుకున్న వాట్సప్ చాట్‌ల స్క్రీన్‌షాట్లలో గుర్తించారు. పోర్న్ వీడియోల ఉత్పత్తి గురించి ముంబై పోలీసులు చెప్పిన ఈ చాట్లలో, రాజ్‌కుంద్రా మార్కెటింగ్, అమ్మకాలు మరియు మోడళ్ల చెల్లింపు మరియు మర్కెటింగ్ ప్లాన్ల గురించి మాట్లాడటం పోలీసులు గమనించారు. నవీ ముంబైలోని నెరుల్ నుంచి గత మంగళవారం ర్యాన్‌జాన్‌ను అరెస్టు చేసిన తరువాత నిన్న రాత్రి రాజ్‌కుంద్ర ను అరెస్ట్ చేశారు.

2021 ఫిబ్రవరి 4 న ముంబైలోని, మాల్వానీ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్,మరియు సమాచార సాంకేతిక చట్టం, మరియు మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాజ్ కుంద్ర కీలక కుట్రదారుడిగా కనిపిస్తున్నాడు అని ముంబై పోలీసులు తెలిపారు. పోర్న్ చిత్రాల నిర్మాణానికి సంబంధించి మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పోలీసులు వెల్లడించారు.