వాట్సప్ విడాకులు: నాగపూర్ కోర్టు సంచలన తీర్పు

నాగపూర్ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విడాకుల కోసం అప్లై చేసుకున్న కేసులో, కోర్టుకు హాజరు కాలేకపోయిన భార్యను వాట్సప్ వీడియో కాల్ ద్వారా విచారించి విడాకులు మంజూరు చేశారు న్యాయమూర్తి.

  • Published By: chvmurthy ,Published On : January 17, 2019 / 10:13 AM IST
వాట్సప్ విడాకులు: నాగపూర్ కోర్టు సంచలన తీర్పు

నాగపూర్ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విడాకుల కోసం అప్లై చేసుకున్న కేసులో, కోర్టుకు హాజరు కాలేకపోయిన భార్యను వాట్సప్ వీడియో కాల్ ద్వారా విచారించి విడాకులు మంజూరు చేశారు న్యాయమూర్తి.

నాగపూర్: నాగపూర్ ఫ్యామిలీ కోర్టులో జనవరి 14న వింత తీర్పు వెలువడింది. ఒక విడాకుల కేసులో వాట్సప్ ద్వారా విచారణ జరిపి విడాకులు మంజూరు చేశారు జడ్జిగారు. దేశంలో ఇటీవల కాలంలో విడాకుల సంస్కృతి పెరిగిపోతోంది. కారణాలేమైనా పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు కోరేవారు ఎక్కవయ్యారు. ఏళ్ళ తరబడి సంసారం చేసి,పిల్లల్ని కని వాళ్ళను పెద్దవాళ్ళను చేసి పెళ్లిళ్ళి చేసి కూడా…విడాకులు తీసుకోటానికి కోర్టు మెట్లు ఎక్కుతున్నవాళ్ళు ఉన్నారు. వీళ్లు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కొందరికి త్వరగా వస్తే కొందరికి ఏళ్ళు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నాగపూర్ ఫ్యామిలీ కోర్టు భార్యా,భర్తలు ఇద్దరి పరస్పర అంగీకారంతో,వాట్సప్ ద్వారా విచారణ జరిపి విడాకులు మంజూరు చేసింది.

వివరాల్లోకి వెళితే … నాగపూర్ లో నివసించే వ్యక్తికి సికింద్రాబాద్ లో ఉండే యువతితో 2013 ఆగస్టు 11 న సికింద్రాబాద్ లో పెళ్లయ్యింది. పెళ్లైన తర్వాత దంపతులు మిషిగాన్ లో  కాపురం పెట్టారు. కొన్నాళ్లకు నాగపూర్ వచ్చి భార్య అత్తగారింట్లో ఉంది. ఆసమయంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. వారు తిరిగి మిషిగాన్ వెళ్లిపోయారు. వీసా గడువు ముగిసి పోవటంతో ఈసారి భార్య స్టూడెంట్ వీసా మీద మిషిగాన్ వెళ్లింది. మిషిగాన్ లో పనిచేస్తున్న భర్త నాగపూర్ కోర్టులో విడాకులకు పిటీషన్ దాఖలు చేశాడు. పిటీషన్  స్వీకరించిన ఫ్యామిలీ కోర్టు విచారణలో భాగంగా భార్య, భర్తలను హాజరుకావాలని ఆదేశించింది. అయితే తాను విడాకుల కేసుకు డైరెక్టుగా హాజరుకాలేనని, వాట్సప్ వీడియో కాల్ ద్వారా హాజరవుతానని భార్య కోర్టుకు తెలిపింది. నాగపూర్ కోర్టుకు వచ్చిన భర్తకూడా అందుకు అంగీకరించాడు. వీరిద్దరి సమ్మతితో  ఫ్యామిలీ కోర్టు జడ్జి స్వాతిచౌహాన్ వాట్సప్ వీడియో కాల్ లో విచారణ జరిపి భర్త, భార్యకు రూ.10 లక్షలు చెల్లించాలనే నిబంధనతో విడాకులు మంజూరు చేశారు.