హైదరాబాద్‌లో ప్రముఖుల వాట్సాప్‌ హ్యాక్‌, కోడ్‌ మేసేజ్‌లతో జాగ్రత్త అంటున్న పోలీసులు, ఎవరికీ పంపొద్దని సూచన

  • Published By: naveen ,Published On : September 29, 2020 / 11:41 AM IST
హైదరాబాద్‌లో ప్రముఖుల వాట్సాప్‌ హ్యాక్‌, కోడ్‌ మేసేజ్‌లతో జాగ్రత్త అంటున్న పోలీసులు, ఎవరికీ పంపొద్దని సూచన

WhatsApp hack of celebrities in Hyderabad: హైదరాబాద్‌లో పలువురు ప్రముఖుల వాట్సాప్‌ హ్యాక్‌ అయింది. ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో సైబర్‌ కేటుగాళ్లు వాట్సాప్‌ మెసేజ్‌లు చేస్తున్నారు. ఎమర్జెన్సీ హెల్ప్‌ అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు. ఓటీపీ నెంబర్‌ పంపాలంటూ రిక్వెస్ట్‌లు చేస్తున్నారు. ఓటీపీ నెంబర్‌ చెప్పగానే వాట్సాప్‌ క్రాష్‌ అవుతోంది. బాధితుల్లో పలువురు సెలబ్రిటీలు, డాక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌లో వచ్చే కోడ్‌ మెసేజ్‌లను ఎవరికీ పంపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.




గత నెల రోజులుగా ఫేస్ బుక్ ని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు, ఫేక్ ప్రొఫైల్స్ తో చాలామంది నుంచి డబ్బు వసూలు చేశారు. ఇప్పుడు సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ పై కన్నేశారు. హైదరాబాద్ లో ప్రముఖుల వాట్సాప్ హ్యాక్ చేశారు. తమ వాట్సాప్ హ్యాక్ అయినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో మూడు కమిషనరేట్ల పరిధిలోనూ ఇలాంటి ఫ్రాడ్స్ వెలుగు చూశాయి.

ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా అకౌంట్స్ ను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. డాక్టర్లను కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ పేరుతో వారికి ఒక కోడ్ పంపుతారు. ఆ కోడ్ క్లిక్ చేయగానే వారి వాట్సాప్ క్రాష్ అవుతుంది. ఆ తర్వాత హ్యాక్ అవుతుంది. దీంతో అందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. వాట్సాప్ కు వచ్చే మేసేజ్ లను క్లిక్ చేయడం కానీ ఫార్వర్డ్ చేయడం కానీ చేయవద్దని కోరుతున్నారు.




మెస్సేజింగ్ యాప్‌ల భద్రతపై రోజురోజుకీ అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ జాబితాలో వాట్సాప్ కూడా చేరింది. కొన్ని రకాల స్టాకర్‌వేర్ (Stalkerware) యాప్స్… వాట్సాప్ వినియోగదారుల యాక్టివిటీని తెలుసుకోగలవనే వార్త తాజాగా వినిపిస్తోంది. ఈ స్టాకర్వేర్ యాప్‌లు వాట్సాప్‌లోని ఆన్‌లైన్ సిగ్నలింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకుంటున్నాయి. తద్వారా వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అనే వివరాలు తెలుసుకోవచ్చు.

ఆ డేటాను కొన్ని రోజులు, వారాల పాటు ట్రాక్ చేయడం ద్వారా ఖాతాదారుల పూర్తి ప్రొఫైల్, యాక్టివిటీ, ఇంటరాక్షన్స్ వంటివి ఇతరులకు తెలిసిపోతాయి. ట్రాకింగ్ ద్వారా వాట్సాప్ ఛాట్ లిస్టును, ఇతర కంటెంట్ లను ఇతరులు యాక్సెస్ చేసే అవకాశం మాత్రం లేదని తెలుస్తోంది. వాట్సాప్‌లో ఉన్న Encryption ఆప్షన్ దీన్ని అడ్డుకోవడమే ఇందుకు కారణం.






* హైదరాబాద్‌లో పలువురి ప్రముఖుల వాట్సాప్‌ హ్యాక్‌
* ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో పలువురికి వాట్సాప్‌ మెసేజ్‌లు
* ఎమర్జెన్సీ హెల్ప్‌ అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో ఎస్‌ఎంఎస్‌లు
* ఓటీపీ నెంబర్‌ పంపాలంటూ రిక్వెస్ట్‌లు
* ఓటీపీ నెంబర్‌ చెప్పగానే వాట్సాప్‌ క్రాష్‌



* బాధితుల్లో పలువురు సెలబ్రిటీలు, డాక్టర్లు
* వాట్సాప్‌లో వచ్చే కోడ్‌ మెసేజ్‌లను ఎవరికీ పంపొద్దంటున్న పోలీసులు
* కోడ్‌ పంపితే వాట్సాప్‌ చాట్‌ను హ్యాక్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు
* ఎట్టి పరిస్థితుల్లో కోడ్‌ చెప్పొద్దంటున్న సైబర్‌ నిపుణులు