Prank Call : ఐదుగురిని చంపేశారని బాలిక ఫోన్ కాల్ ….

ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో 8 ఏళ్ల బాలిక పోలీసులను ఉరుకులు పరుగులెత్తించింది. టీవీ లో వచ్చే క్రైం సీరియల్స్ చూసి ప్రాంక్ కాల్ చేసింది. 

10TV Telugu News

Prank Call : ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో 8 ఏళ్ల బాలిక పోలీసులను ఉరుకులు పరుగులెత్తించింది. టీవీ లో వచ్చే క్రైం సీరియల్స్ చూసి ప్రాంక్ కాల్ చేసింది.  ఘజియాబాద్ లో 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక తన తండ్రి మొబైల్ ఫోన్ నుంచి  జులై20, మంగళవారం, మధ్యాహ్నం గం.2-30ల సమయంలో పోలీసు హెల్ప్ లైన్ కు ఫోన్ చేసింది.

పోలీస్ అంకుల్ ..లేన్ నెంబర్ 5 లోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఐదుగురు హత్యకు గురయ్యారు. నేను ఒంటరిగా ఉన్నాను. మీరు త్వరగా రండి అంకుల్ అంటూ ఫోన్ చేసింది. బాలిక ఫోన్ తో   అలర్ట్ అయిన పోలీసులు వెంటనే  బాలిక చెప్పిన ప్రాంతానికి చేరుకున్నారు. తీరా అక్కడకు వచ్చేసరికి హత్య జరిగిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు.

వెంటనే వారు తమకు వచ్చిన ఫోన్ నెంబరుకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. కొంత సేపటి తర్వాత పోలీసులు మళ్లీ ప్రయత్నం  చేయగా  ఆబాలిక తండ్రి ఫోన్ లిఫ్టు చేసి మాట్లాడారు.   జరిగిన విషయం ఆయనకు చెప్పగా… తమ కుమార్తె   ప్రాంక్  కాల్ చేసి ఉంటుందని తాపీగా చెప్పాడు.  గతంలో కూడా తన కూతురు ఇలాగే  ప్రాంక్ కాల్స్ చేసిందని తెలిపాడు.

తనకు ప్రమాదం జరిగిందని బంధువులకు ఫోన్ చేయగా వారంతా హుటాహుటిన ఇంటికి బయలు దేరి   వచ్చారని వెల్లడించాడు. మరో వైపు  తన కుమార్తె టీవీలో వచ్చే క్రైం షోలు ఎక్కువగా చూస్తుందని…. అందులో లాగా పోలీసులు   స్పందిస్తారా లేదా అని… అప్పుడప్పుడు ఇలా కాల్స్ చేస్తుందనవి వివరించాడు. దీంతో పోలీసులు ….ఇకపై ఇలా జరగకుండా చూడాలని బాలిక తండ్రిని హెచ్చరించారు.

10TV Telugu News