నిర్భయ హంతకులకు ఉరి ఎప్పుడు?: చట్టం ఏం చెబుతోంది

  • Published By: sreehari ,Published On : December 13, 2019 / 08:52 AM IST
నిర్భయ హంతకులకు ఉరి ఎప్పుడు?: చట్టం ఏం చెబుతోంది

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు హంతకులు ఉరికంబం ఎక్కే సమయం ఆసన్నమవుతోంది. నిర్భయ హంతుకులను ఎప్పుడు ఉరితీస్తారా అని యావత్తూ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.ఉరితాళ్ల కోసం అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రత్యేకమైన ఉరితాళ్లను సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. 23ఏళ్ల పారామెడిక్ విద్యార్థినిపై నలుగురు నిందితులు గ్యాంగ్ రేప్ పాల్పడిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి నిందితులను ఉరితీయాలని నిర్భయ తల్లిదండ్రులు కోరుతూనే ఉన్నారు. తమ బిడ్డను బలిగొన్న నిందితులను తొందరగా ఉరితీస్తేనే తమకు మన:శాంతి, ఆమెకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. 2012 డిసెంబర్ 16న నిర్భయ ఘటన జరిగింది. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

సత్వర న్యాయం జరగాలని కోరుతున్న నిర్భయ తల్లిదండ్రులు వేసిన పిటిషన్ పై సెషన్ కోర్టు ఎదుట వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విచారణ జరుగనుంది. నిందితుల ఉరిశిక్షపై తీహార్ జైల్లోని అధికారులు కూడా యూపీని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉరిశిక్షకు సంబంధించి ఏర్పాట్లు వేగవంతమైనట్టు తెలుస్తోంది.

మరోవైపు.. నిర్భయ నిందితుల్లో ఒకరు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడం.. ఆ తర్వాత ఉపసంహరించుకోవడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించినప్పటి నుంచి సదరు నిందితుడికి ఉరిశిక్ష అమలు చేయడాలంటే నిర్దిష్టమైన వ్యవధి ఉండాలనేది ఉంది. కానీ, అంతకంటే ముందుగానే నిందితులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉరిశిక్ష అమలు విషయంలో ఏమి చేయొచ్చు.. ఏం చేయకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

14 రోజుల వ్యవధి ఉండాలి :
మోడల్ ప్రిజన్ మ్యానువల్ 2016 ప్రకారం.. ఉరిశిక్ష పడే వ్యక్తి.. క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసి ఉండి.. పిటిషన్ తిరస్కరణకు గురికావడం తానంతటా తానే ఉపసంహరించుకుంటే.. ఆ సమయంలో సదరు నిందితుడికి ఉరిశిక్ష అమలు చేయాలంటే నిర్దిష్టమైన వ్యవధి ఉండాలనేది చట్టం చెబుతోంది. అంటే.. పిటిషన్ తిరస్కరణ సమయం నుంచి ఉరిశిక్ష విధించే తేదీకి మధ్య 14 రోజుల సమయం ఉండాలి.

నిర్భయ రేప్ కేసు నిందితుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. దీనిపై డిసెంబర్ 17న విచారణకు రానుంది. ఒకవేళ సుప్రీం కోర్టు అదే రోజున విచారిస్తే మాత్రం వచ్చే జనవరిలో ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది.

అందరికి ఒకటే :
ఉరిశిక్ష పడేవారిలో ఒకరి కంటే ఎక్కువ మందికి ఉరిశిక్ష అమలు చేయాల్సి వస్తే.. హైకోర్టు లేదా సుప్రీంలో స్పెషల్ లీవ్ కోసం అభ్యర్థించవచ్చు. దోషులందరికి ఉరిశిక్ష అమలు వాయిదా పడాలంటే మాత్రం దోషుల్లో ఒకరు ఉన్నా సరే ఉరిశిక్ష వాయిదా పడుతుంది./p>

ఉరికి సమయం ఇదే :
ఉరిశిక్షలన్నీ అమలు చేసే సమయం ఒకేలా ఉంటుంది. సాధారణంగా తెల్లవారుజామున ఇలాంటి ఉరిశిక్షలు అమలు చేస్తుంటారు. దోషుల చేతులను వెనక్కి కట్టేసి అమలు చేస్తారు. అపరాధుల్లో ఎవరిని కూడా పబ్లిక్ హాలీడే రోజున మాత్రం ఉరితీయడం జరగదు.

10 ఉరితాళ్లు రెడీ.. తీహార్ జైలుకు :
ఇదిలా ఉండగా, నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసేందుకు ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారు జైలు అధికారులు. ఇందుకోసం బీహార్ లోని బక్సర్ జైల్లో 10 ఉరితాళ్లు తయారు చేయించారు. మెత్తని దూదితో తయారు చేసిన తాళ్లను తీహార్ జైలుకి అధికారులు పంపనున్నారు. ఉరితాళ్లను 7వేల 200 దారాలతో తయారు చేశారు. ఇందుకు 16 అడుగుల తాడు అవసరమైంది. తాళ్లను మృదువుగా ఉంచడానికి తగినంత తేమ వాడారు. ఈ 10 తాళ్లను తీహార్ జైలుకి పంపే పనిలో అధికారులు ఉన్నారు. ఒక్కో ఉరితాడు 1.5 కిలోల బరువు ఉంటుందన్నారు. ఒక్కో ఉరి తాడు తయారు చేయడానికి రూ.1,120 ఖర్చవుతుందని వివరించారు.

బరువు బట్టి ఉరితాడు :
ఉరిశిక్ష పడే వ్యక్తి బరువును మోయగలే విధంగా ఉరితాళ్లను సిద్ధం చేస్తారు. ఉరితాడు బరువుగా ఉంటేనే ఈజీగా ఉరిశిక్ష అమలు చేసేందుకు ఈజీగా ఉంటుంది. ఒక్కో తాడు 150 కిలోల బరువును వ్యక్తి భారాన్ని మోయగలదు. మెడ, వెన్నుపూస మధ్య బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉరితాళ్లకు ఉపయోగించే తాళ్లలో యార్న్ లేదా మనీలా అనే మృదువైన దూదిలో తయారుచేస్తారు. ఒక్కో తాడు 2.59 నుంచి 3.81 సెంటీమీటర్ల మందం ఉంటుంది. 29 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఉరికి వాడే తాడుకు ఏదైనా ఆయిల్ లేదా వెన్న రాసి ఉండాలి. ఉరికంభానికి ఒక్కో వ్యక్తికి రెండు చొప్పున తాళ్లను రిజర్వ్ చేస్తారు. ఉరితీసే సమయంలో ఏదైనా ఘటన జరిగినా మరొకటి వాడేందుకు ఉపకరిస్తుందని ముందుగా ఉంచుతారు.

ఎవరిని అనుమతించరు :
ఉరిశిక్ష విధించే ప్రాంతానికి ఖైదీలు ఎవరిని అనుమతించరు. ఉరిశిక్ష పూర్తియ్యే వరకు వారిని లాక్ చేసి ఉంచుతారు. శిక్షపడే దోషులకు కూడా ఉరితీసే నిర్మాణాలను చూసేందుకు అనుమతించరు. శిక్షపడే వ్యక్తి ముఖానికి దూది క్యాప్ తో మూసివేస్తారు. కనీసం 30 నిమిషాల పాటు వ్యక్తి శరీరాన్ని వేలాడదీస్తారు.