Army Chopper Crash : ఆఖరి మజిలీలోనూ భర్త వెంటే..మధులికా రావత్ ఎవరో తెలుసా?

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కూనూర్ కి 7 కిలోమీటర్ల దూరంలో బుధవారం మధ్యాహ్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన ప్ర‌మాద ఘ‌ట‌న‌లో త్రివిధ దళాధిపతి జ‌న‌ర‌ల్ బిపిన్

Army Chopper Crash : ఆఖరి మజిలీలోనూ భర్త వెంటే..మధులికా రావత్ ఎవరో తెలుసా?

Ar2

Army Chopper Crash : త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కూనూర్ కి 7 కిలోమీటర్ల దూరంలో బుధవారం మధ్యాహ్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన ప్ర‌మాద ఘ‌ట‌న‌లో త్రివిధ దళాధిపతి జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తో పాటు ఆయన భార్య మ‌ధులికా రావ‌త్ సహా రక్షణ దళాలకు చెందిన 13మంది మృతి చెందారు.

ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో మొత్తం 14 మంది ఉండగా..ఒక్కరు తప్ప అందరూ మృతి చెందిన అధికారులు నిర్థారించారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో 90 శాతం కాలిన గాయాల‌తో ఒకరు వెల్లింగ్టలన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు సమాచారం. చికిత్స పొందుతున్నారు.

హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన బిపిన్ రావత్ భార్య ఎవరో తెలుసా?
బిపిన్ రావత్ ఉన్నత స్థాయికి ఎదగడంలో ఆయన వెన్నంటి నడిచిన వ్యక్తి ఆయన భార్య మధులికా రావత్. వీరికి ఇద్దరు కుమార్తెలు. మధులిక రావత్.. ఆర్మీ ఉద్యోగుల భార్యల వెల్ఫేర్ అసోసియేషన్(AWWA) ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్మీ మృతుల కుటుంబాల సంక్షేమం కోసం మధులికా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఢిల్లీ యూనివర్సిటీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన మధులిక ఆర్మీ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం తపన పడ్డారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, చైతన్య పరిచే ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆర్మీ విడోస్, కేన్సర్ పేషెంట్స్,దివ్యాంగుల కోసం ఆమె సేవా కార్యక్రమాలు చేపట్టారు. చాలా మందిని ఆర్థికంగా స్వతంత్రులుగా మార్చడం కోసం.. అల్లడం, బ్యాగుల తయారీ వంటి అనేక కోర్సులను మధులికా ప్రోత్సహించింది. మధులికా చివరి శ్వాస వరకు భర్త వెన్నంటే ఉండి.. ఆఖరి మజిలీలోనూ ఆయన తోడు పంచుకున్నారు.

ALSO READ RIP CDS General Bipin Rawat : నిజమైన దేశభక్తుడు బిపిన్ రావత్..ప్రముఖుల సంతాపం

ALSO READ Army Chopper Crash : భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి..