వృద్ధుల కోసమే ఈ కంపెనీ ప్రత్యేకించి ఎందుకు సర్వీసు అందిస్తుందో తెలుసా?

  • Published By: sreehari ,Published On : October 25, 2020 / 05:33 PM IST
వృద్ధుల కోసమే ఈ కంపెనీ ప్రత్యేకించి ఎందుకు సర్వీసు అందిస్తుందో తెలుసా?

cater exclusively to senior citizens : పూణే ఆధారిత కంపెనీ ఒకటి ప్రత్యేకించి వృద్ధుల కోసమే సర్వీసు అందిస్తోంది.. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వృద్ధులకు అవసరమైన ప్రతి వస్తువులను ఇంటికి చేరవేస్తోంది. అదే.. సీనియారిటీ (Seniority) కంపెనీ.. సీనియర్ క్యూరేటెడ్ ఉత్పత్తులను సీనియర్ సిటిజన్లకు అందించడంలో ఎంతో పాపులర్ అయింది.



కరోనా సమయంలో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి. ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వృద్ధులు ఇళ్లకే పరిమితమయ్యారు. అందుకే వృద్ధుల వైద్య, సంరక్షణ, జీవనశైలి, విశ్రాంతికి సంబంధించి 10,000 ఉత్పత్తులను కంపెనీ విక్రయిస్తోంది. రోజుకు 1,500 ఆర్డర్లు వరకు కంపెనీకి వస్తుంటాయి. భారతదేశంలో పెరిగిపోతున్న సీనియర్ సిటిజన్ల జనాభాను దృష్టిలో ఉంచుకుని ఆయూష్ అగర్వాల్, తాపన్ మిశ్రా అనే ఇద్దరు వ్యక్తులు కలిసి 2016లో Seniority అనే కంపెనీని స్థాపించారు.



భారతదేశంలో 60 ఏళ్ల దాటిన వృద్ధుల జనాభా వేగంగా పెరిగిపోతోంది. వాస్తవానికి 2001 నుంచి మొత్తం జనాభాలో 8 శాతం వృద్ధుల జనాభానే ఉంది. 2011 నాటికి 10 శాతానికి పెరిగింది. 2041 నాటికి వృద్ధుల జనాభా మొత్తం దేశ జనాభాలో 20 శాతానికి పెరిగే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.



వృద్ధుల కోసం రిటైల్ మార్కెట్ చేరువగా లేదని గుర్తించామని కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు. అప్పుడే Seniority అనే కంపెనీ పెట్టాలనే ఆలోచన వచ్చిందని పేర్కొన్నారు.

RPG Ventures కంపెనీ స్థాపనకు నిధులను సమకూర్చింది. RPG గ్రూపు కంపనీలు ఈ వెంచర్ కోసం 10 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి.



సీనియర్ సిటిజన్ల కోసం అందించే కొన్ని ఉత్పత్తుల్లో వాకర్లు, రోలేటర్లు, వీల్ చైర్లు, ఫిట్ నెస్ గేర్లు, బెడ్ రూం యాక్ససరీస్ వంటి ఎన్నో ప్రొడక్టులను అందిస్తోంది.

సీనియర్లు సిటిజన్లు కూడా గృహ అవసరాలు, తోటపని, కిచెన్ & డైనింగ్, మ్యూజిక్ ప్రొడక్ట్స్, ఫుడ్, న్యూట్రిషన్ తో పాటు గిఫ్టింగ్ ప్రొడక్టులను కొనుగోలు చేస్తున్నారు.



దేశంలోని నాలుగు నగరాల్లో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌తో పాటు రిటైల్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌లను పూణే, చెన్నై, కోయంబత్తూర్ భివాడి ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది.

అక్టోబర్ 2020లో, సంస్థ తన మొదటి ఫ్రాంచైజ్ స్టోర్ పూణేలో ప్రారంభించింది. రాబోయే రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజ్ యాజమాన్యంలోని తమ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని కంపెనీ భావిస్తోందని మిశ్రా చెప్పారు.

లాక్ డౌన్ ఆంక్షల కారణంగా పలు డెలివరీ సంస్థలకు ఆన్‌లైన్ అమ్మకాలను అమాంతం పెంచేశాయి. లాక్ డౌన్ సమయంలో ముసుగులు, హ్యాండ్ శానిటైజర్లు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు భారీ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం పలు కంపెనీ అమ్మకాలలో సుమారు 95 శాతం వెబ్‌సైట్, ఇతర సోషల్ మీడియా ఛానెల్‌లతో ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు అందిస్తున్నాయి.