Wife Bites Husbands Tongue : బాబోయ్.. ఇంటికి రమ్మన్నాడని, భర్త నాలుక కొరికేసిన భార్య

ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. భర్త నాలుకను పట్టుకుని కొరికేసింది. ఆమె ఎంత గట్టిగా కొరికిందంటే.. నాలుక తెగి నేలపై పడింది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న భర్త మున్నాను ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భార్య సల్మాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Wife Bites Husbands Tongue : బాబోయ్.. ఇంటికి రమ్మన్నాడని, భర్త నాలుక కొరికేసిన భార్య

Wife Bites Husbands Tongue : భార్యాభర్తలన్నాక తగాదాలు కామన్. దంపతుల మధ్య అప్పుడప్పుడు కలహాలు వస్తుంటాయి. ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతుంటాయి. అయితే అది కాసేపే. మళ్లీ అన్ని మర్చిపోయి ఒక్కటవుతారు. అదే బంధం, అనుబంధం అంటే. అయితే, కొన్ని సందర్భాల్లో భార్య, భర్త మధ్య జరిగే ఆర్గుమెంట్ తీవ్రమైన పరిమాణాలకు దారితీస్తోంది. మ్యాటర్ చాలా దూరం వెళ్తోంది. పట్టరాని కోపంలో భర్త లేదా భార్య దారుణాలకు ఒడిగడుతున్నారు. భర్తతో వాగ్వాదంతో కోపంతో ఊగిపోయిన భార్య.. భర్త నాలుకను కొరికేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Also Read..14-year-old killed: రూ.18,000 కోసం 14 ఏళ్ల బాలుడిని చంపి మురుగు కాలువలో పడేసిన ఐదుగురు

ఠాకూర్ గంజ్ కు చెందిన సల్మా, మున్నా దంపతులు. అయితే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అలిగిన భార్య.. తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త మున్నా భార్య పుట్టింటికి వెళ్లాడు. ఇంటికి తిరిగి రావాలని భార్యను కోరాడు. ఈ విషయమై మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటికి రావాలని భర్త కోరగా ఆమె అందుకు ఒప్పుకోలేదు. భర్తతో వెళ్లేందుకు నిరాకరించింది. నేను రాను అని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి నడుమ గొడవ పెద్దదైంది.

ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. భర్త నాలుకను పట్టుకుని కొరికేసింది. ఆమె ఎంత గట్టిగా కొరికిందంటే.. నాలుక తెగి నేలపై పడింది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న భర్త మున్నాను ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భార్య సల్మాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read..Maharashtra : ప్రేయసి కళ్లల్లో ఆనందం కోసం 19ఏళ్ల యువకుడి ఘనకార్యం .. షాక్ అయిన పోలీసులు

కాగా, దంపతుల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో భార్య సల్మా తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భర్త.. భార్య సల్మా పుట్టింటికి వెళ్లాడు. పిల్లలను చూడాలని అనుకున్నాడు. భార్యను ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఆ సమయంలో జరిగిన గొడవలో విచక్షణ కోల్పోయిన భార్య.. భర్త నాలుకను కొరికేసింది. అతడి నాలుక తెగేలా ఆమె కొరికేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.