Publish Date - 12:29 pm, Fri, 5 March 21
wife caught husband due to extra marital affair in khammam district : పెళ్లై పుష్కరకాలం దాటింది…. భార్య మొహం మొత్తిందో.. లేక పెళ్లాం పాతదై పోయిందని రోతపుట్టిందో ఏమో భార్య ఉండగానే ఓ కేబుల్ ఆపరేటర్ మరోక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యకు అంతకు ముందు చేయించిన నగలన్నీ బ్యాంకులో తాకట్టు పేరుతో తీసుకెళ్లి ప్రియురాలికి అలంకరించాడు. అనుమానం వచ్చిన భార్య భర్త కృష్ణలీలలు కనిపెట్టి బంధువులతో కలిపి బడితపూజ చేసింది. ఈఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
కొత్తగుడెం మేదరబస్తీలో కేబుల్ ఆపరేటర్ గా పని చేస్తున్నరాజు అనే వ్యక్తి అదే ఏరియాకు చెందిన కృష్ణవేణి అనే మహిళతో 13 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. రాజు కేబుల్ ఆపరేటర్ గా పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఏడాది క్రితం రాజు…. గాజుల రాజం బస్తీకి చెందిన మరోక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
అప్పటి నుంచి భార్య నగలను అప్పుడొకటి అప్పుడొకటిగా తీసుకుని బ్యాంకులో కుదవ పెడుతున్నానని చెప్పాడు. వ్యాపార అవసరాల నిమిత్తం డబ్బులు కావాలని.. బ్యాంకులో తాకట్టు పెట్టటానికి అని భార్యకు అబద్దం చెప్పి తీసుకెళ్లి ప్రియురాలికి ఇచ్చాడు. వ్యాపారం కోసమని చెప్పే సరికి భార్యకు ఇన్నాళ్లు అనుమానం రాలేదు.
కానీ ఇటీవల కాలంలో భర్త కదలికలపై అనుమానం వచ్చిన భార్య తన బంధువులతో నిఘా పెట్టించింది. భర్త వేరొక మహిళతో ఉంటున్నాడని తెలుసుకుంది. గురువారం పనిమీద బయటకు వెళుతున్నానని చెప్పి వెళ్లిన భర్త వెనుక అతనికి తెలియకుండా బంధువులతో సహా ఫాలో అయ్యింది.
భర్త తన ప్రియురాలి ఇంటిలోకి వెళ్లిన కొద్ది సేపటికి తన బంధువులతో కలిసి లోపలకు వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భార్య ఆమె బంధువులు భర్తను ఆమె ప్రియురాలిని చితక బాదారు.
కాగా…. భార్యతో గొడవలు జరుగుతున్నాయని… ఆమెకు విడాకులు ఇచ్చేసి నిన్ను చేసుకుంటానని చెప్పి తనతో సంబంధం పెట్టుకున్నట్లు సదరు మహిళ చెప్పింది.సమాచారం తెలుసుకున్న స్ధానిక పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి రాజును…అతడి ప్రియురాలిని స్టేషన్ కు తీసుకువెళ్లారు. రాజు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
YS Sharmila : ఏదో ఒక రోజు తెలంగాణకు సీఎం అవుతా..అప్పటివరకు మంచి నీళ్లు కూడా ముట్టను.. షర్మిల శపథం..
Uru Vada News : ఊరు వాడ.. 60 న్యూస్
Tenth Exams : తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు..ఇంటర్ వాయిదా
షర్మిల దీక్షకు ముగిసిన గడువు.. భారీగా మోహరించిన పోలీసులు
కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం
Telangana Election Notification : తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల