Women Suicide: పండక్కి భర్త ఇంటికి రాలేదని భార్య ఆత్మహత్య

దసరా పండుగకు భర్త ఇంటికి రాను అన్నాడనే మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకుంది.

Women Suicide: పండక్కి భర్త ఇంటికి రాలేదని భార్య ఆత్మహత్య

Women Suicide: దసరా పండుగకు భర్త ఇంటికి రాను అన్నాడనే మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా ఆమనగల్లు మేడిగడ్డలో చోటుచేసుకుంది. మేడిగడ్డకి చెందిన వడ్త్యావత్‌ మౌనిక(20)కు అదే గ్రామానికి చెందిన మేనమామ కుమారుడు అనీల్‌తో ఆరు నెలల క్రితమే పెళ్లయ్యింది.

డీసీఎం డ్రైవర్‌‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించే అనీల్.. వృత్తిరిత్యా వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లిన అనిల్ పండుగకు రాలేకపోయాడు. దీంతో మనస్థాపం చెందిన మౌనిక క్షణికావేశంలో పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

మౌనిక ఆత్మహత్యాయత్నం చేసినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే కల్వకుర్తి గవర్నమెంట్‌ హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లగా.. అప్పటికే మౌనిక చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు. పండుగ పూట జరిగిన విషాదంతో ఇరు కుటుంబాలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.