Extra Marital Affair : వివాహేతర సంబంధం-ఉపాధ్యాయుడి హత్య

నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో   మే  14న జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసును పోలీసులు చేధించారు.

Extra Marital Affair : వివాహేతర సంబంధం-ఉపాధ్యాయుడి హత్య

Kurnool Murder

Extra Marital Affair :  నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో   మే  14న జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసును పోలీసులు చేధించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత భార్యే,  భర్తను హత్య చేసిందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను తమ్ముడు,  ప్రియుడితో కలిసి హతమార్చిందా ఇల్లాలు.

పాణ్యంకు చెందిన షేక్ జవహర్ హుసేన్ బనగాన పల్లె మండలం చెరువుపల్లె ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవాడు. అతనికి భార్య షేక్‌ హసీనా, కుమారుడు తమీమ్, కుమార్తె ఆర్పియా ఉన్నారు. కొంత కాలంగా హసీనా అదే ప్రాంతానికి చెందిన మహబూబ్‌బాషా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్లకు ఈ విషయం జవహార్‌ హుసేన్‌కు తెలిసింది. దీంతో అతను పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. వారు మహబూబా బాషాను పిలిచి మందలించి…అతడిని గ్రామం నుంచి ఓర్వకల్లు మండలం హుసేనాపురం పంపించారు.

మహబూబ్ బాషా హుసేనాపురం వెళ్లిపోయినా హసీనా,భాషాలు తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం జవహర్‌ గుర్తించాడు. ఎంత చెప్పినా భార్య వివాహేతర సంబంధం మానుకోక పోవటంతో అతను భార్యను వేధించసాగాడు. వేధింపులు భరించలేని హసీనా ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది.

తన ప్లాన్‌ను తమ్ముడు ఇద్రూస్, ప్రియుడు మహబూబ్‌ భాషాకు వివరించింది. దీంతో వారిద్దరూ మే13వ తేదీన హుసేన్ ను చంపాలని పథకం రూపొందించారు. ఇందులో భాగంగానే తన ఇద్దరు పిల్లలను తన తల్లి ఇంటికి పంపించింది. ఆ రోజు జవహర్‌ హుసేన్‌ పాణ్యం మండలం మద్దూరులో ఇస్తెమాకు వెళ్లి రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకుని పడుకున్నాడు.

అప్పటికే ఇంటిపైన కాపు కాసుకుని ఉన్న ఇద్రూస్, మహబూబ్‌బాషా అర్ధరాత్రి కిందకు దిగి వెళ్లి హసీనాతో కలసి జవహర్‌ హుసేన్‌ కాళ్లకు తాడు కట్టి గొంతునొక్కి చంపేశారు.  అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా హుస్సేన్ కు అస్తమా ఉందని ఊపిరాడక…   పలకడం  లేదని బంధువులకు ఫోన్లు చేసి చెప్పింది.  తాను భర్త శవాన్ని తీసుకుని స్ధానిక శాంతారాం ఆస్పత్రకి తీసుకు వెళ్ళింది.

అక్కడ డాక్టర్లు హుస్సేన్ ను పరీక్షించి అప్పటికే   చనిపోయినట్లు ధృవీకరించారు. అయితే తన అన్నకు ఆస్తమా ఉన్నప్పటికీ మందులు సక్రమంగా వాడతాడని… ఆస్తమాతో చనిపోయే అవకాశం లేదని తమ్ముడు కరీముల్లా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం చేయించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా   దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్యే హంతకురాలని తేల్చారు. దీంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 3 సెల్ ఫోన్లు హత్యకు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Janasena Janavani : ప్రభుత్వాన్ని నిలదీసేలా.. జనసేన కొత్త కార్యక్రమం జనవాణి