Extra Marital Affair : ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను హత్య చేయించిన ప్రియురాలు

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని  భర్తను తన ఇద్దరు ప్రియులతో కలిసి అతి క్రూరంగా హత్య చేయించిందో ఇల్లాలు. 

Extra Marital Affair : ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను హత్య చేయించిన ప్రియురాలు

Wife Killed Her Husband With The Help Of Two Lovers

Extra Marital Affair వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని  భర్తను తన ఇద్దరు ప్రియులతో కలిసి అతి క్రూరంగా హత్య చేయించిందో ఇల్లాలు.  మధ్య ప్రదేశ్ లోని రింగ్‌నాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంకర్వా గ్రామంలో నివసించే రామ్‌లాల్, రేఖాబాయ్ భార్యా భర్తలు. రేఖాబాయ్ తన స్వగ్రామానికి చెందిన సమర్ధ్ అనే వ్యక్తితోనూ,  తన భర్త గ్రామానికి చెందిన శంకర్‌లాల్ మాల్వియా అనే  వ్యక్తితోనూ వివాహేతర సంబంధం పెట్టుకుంది.ringnod

కొన్నాళ్లకు ఈ విషయం రామ్‌లాల్ కు తెలిసింది. దీంతో  భార్యా భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రేఖా‌బాయ్ కొన్నాళ్లు పుట్టింటికి  వెళ్లిపోయింది. పెద్దమనుషులు వారిద్దరి మధ్య రాజీ కుదర్చటంతో   నెల రోజుల క్రితమే ఆమె తిరిగి భర్త రామ్‌లాల్  వద్దకు కాపురానికి వచ్చింది.

భార్య తిరిగి వచ్చినా భర్త రామ్‌లాల్‌కు భార్య మీద అనుమానం పోలేదు.  తిరిగి ఇద్దరూ పోట్లాడుకుంటూనే ఉన్నారు. రేఖా‌బాయ్ తన ప్రియులకు ఈ విషయం తెలిపింది.  ఇక భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియులతో కలిసి ప్లాన్ వేసింది.  సమర్ధ్, శంకర్‌లాల్   కలిసి కంకర్వా గ్రామంలోని సత్యనారాయణ అనే వ్యక్తితో కలిసి రామ్‌లాల్ ను హత్య చేసేందుకు పధకం రచించారు.

రామ్‌లాల్ ను మద్యం తాగుదామని,  సత్యనారాయణ ఊరిలోని నీటి బావి వద్దకు రమ్మని పిలిచాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించటం మొదలెట్టారు.  కాసేపటికి అక్కడకు చేరుకున్న శంకర్ లాల్, సమర్ధ్ కూడా వారితో కలిసి మద్యం సేవించటం మొదలెట్టారు.  ముగ్గురూ కలిసి శంకర్ లాల్ తో ఎక్కువ మద్యం తాగించి అతను స్పృహ కోల్పోయేట్టు చేశారు.

అనంతరం ముగ్గురు కలిసి అతడ్ని హత్య చేసారు. మృత దేహాన్ని గోనె సంచిలో కుక్కి, దానికి రాళ్లు కట్టి అదే బావిలో పడేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.  హత్య జరిగిన ఆరురోజులకు బావి నుంచి దుర్వాసన రావటంతో… జూన్ 28 సోమవారం నాడు స్ధానికులు రింగ్‌నాడ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్ధలానికి వచ్చిన  పోలీసులు బావిలోంచి శవాన్ని బయటకు  తీయించారు. మృతుడ్ని రామ్‌లాల్ గా గుర్తించారు. వాస్తవానికి రామ్‌లాల్ 5,6  రోజులుగా కనపడకుండా పోయినపప్పుడు  అతని భార్య కానీ, కుటుంబ సభ్యులు కానీ, పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు అతడి భార్య రేఖాబాయ్ ను అదుపులోకి తీసుకుని విచారించటంతో నేరం ఒప్పుకుంది.  ఆమె ఇచ్చిన వాంగ్మూలంతో  మిగిలిన నిందితులు శంకర్ లాల్, సమర్ధ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సత్యనారాయణ కోసం పోలీసులు  గాలిస్తున్నారు.