బతికిపోయాడు : సైనేడ్ తో భర్తను చంపాలనుకున్న భార్య

10TV Telugu News

ఈ మధ్యకాలంలో సమాజంలో చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. సినిమాల ప్రభావమో, టీవీల ప్రభావమో తెలియదు కానీ తాళి కట్టిన భర్తను తుదముట్టంచటానికి భార్యలు కొత్త కొత్త టెక్నిక్ లు ఉపయోగిస్తున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లెలో ఒక భార్య తన భర్తను తుదముట్టించటానికి క్రిమినల్ గా మారింది. భర్త గురునాథం భార్య రాణితో కలిసి పొలసానిపల్లిలో నివసిస్తున్నాడు.వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా తరచు గొడవలు జరుగుతున్నాయి.  ఈ క్రమంలో భర్తనుతుదముట్టించటానికి కుమారుడితో కలిసి రాణి ప్లాన్ చేసింది.   

భర్త తినే అన్నంలో సైనేడ్ కలిపి పెట్టింది. భోజనానికి కూర్చున్నగురునాథానికి అనుమానం వచ్చి అన్నం తినకుండా ప్రాణాలు రక్షించుకున్నడు. వెంటనే సమీపంలోని పోలీసుస్టేషన్ లో తన భార్యపై ఫిర్యాదుచేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురునాథం భార్య రాణి, కుమారుడుతో సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.  విచారణ కొనసాగుతోంది. 

×