నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తాం.. సీఎంకు బెదిరింపులు!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. సీఎం కేజ్రీవాల్ కుమార్తెను కిడ్నాప్ చేస్తామని, చేతనైతే రక్షించుకోండి అంటూ సీఎం కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది.

  • Published By: sreehari ,Published On : January 13, 2019 / 10:23 AM IST
నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తాం.. సీఎంకు బెదిరింపులు!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. సీఎం కేజ్రీవాల్ కుమార్తెను కిడ్నాప్ చేస్తామని, చేతనైతే రక్షించుకోండి అంటూ సీఎం కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది.

  • ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అజ్ఞాత ఈ-మెయిల్ 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. సీఎం కేజ్రీవాల్ కుమార్తెను కిడ్నాప్ చేస్తామని, చేతనైతే రక్షించుకోండి అంటూ సీఎం కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. అందులో ‘‘సీఎం కూతుర్ని కిడ్నాప్ చేస్తాం. కాపాడుకోగలిగితే కాపాడుకోండి’’ అని ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ సీఎం కార్యాలయం మూడు రోజుల క్రితం ఈ మెయిల్స్ ను ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ కు ఫార్వాడ్ చేసింది. దీంతో కేజ్రీవాల్ కుమార్తెకు ఢిల్లీ పోలీసు శాఖ భద్రత పెంచింది. ఓ కానిస్టేబుల్ ను ఆమెకు తాత్కాలిక సెక్యూరిటీగా నియమించారు. కేజ్రీవాల్‌కు ఇద్దరు పిల్లలు. కుమార్తె హర్షిత, కుమారుడు పులకిత్. గుర్గావ్ లో కేజ్రీవాల్ కుమార్తె మల్టీనేషన్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. 

ఎప్పుడు బయటకు వెళ్లినా ఆమె వెన్నుంటే పోలీసులు నిఘా ఉంటుందని సీనియర్ పోలీసు (పేరు చెప్పేందుకు నిరాకరించిన) అధికారి ఒకరు వెల్లడించారు. ఢిల్లీ సీఎం కార్యాలయానికి జనవరి 9న మూడు అనుమానాస్పద ఈమెయిల్స్ వచ్చినట్టు గుర్తించామన్నారు. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసు సైబర్ సెల్ ప్రత్యేక విభాగం దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ మెయిల్ బెదిరింపుపై శనివారం సాయంత్రం వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. అయితే ఏ ఐపీ అడ్రస్ నుంచి మెయిల్ వచ్చింది? ఎవరు పంపారు అన్న కోణంలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కేజ్రీవాల్‌కు ఇలాంటి బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. అప్పట్లో ఆయనను చంపేస్తామని హెచ్చరించారు.