Selfie With Gun : తుపాకీతో సెల్ఫీ తీసుకోబోయి….!

లోడ్ చేసిన తుపాకీతో సెల్ఫీ తీసుకోబోయిన మహిళ.. ప్రమాద వశాత్తు తుపాకి పేలి మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో చోటు చేసుకుంది. కాగా ఇది ప్రమాదవశాత్తు కాదు తన కుమార్తెను హత్యచేశారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు.

10TV Telugu News

Selfie With Gun : లోడ్ చేసిన తుపాకీతో సెల్ఫీ తీసుకోబోయిన మహిళ.. ప్రమాద వశాత్తు తుపాకి పేలి మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో చోటు చేసుకుంది. కాగా… ఇది ప్రమాదవశాత్తు కాదు, తన కుమార్తెను హత్యచేశారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు.

హర్దోయి జిల్లాలో జ్యూయలరీ షాపు నడిపే రాజేష్‌గుప్తా కుమారుడు ఆకాష్గుప్తాకు, రాకేష్ కుమార్తె రాధిక(26) ను ఇచ్చి  గతేడాది మే నెలలో వివాహం జరిపించారు. గురువారం మధ్యాహ్నం    రాధిక తన అత్తవారింట్లో రెండో అంతస్తులో ఉన్న   12 బోర్ సింగిల్  బారెల్ తూపాకీతో సెల్ఫీ తీసుకుంటూ తుపాకీ ట్రిగ్గర్ నొక్కింది. దీంతో తుపాకీలోని బుల్లెట్ ఆమె శరీరంలోకి దిగి అక్కడికక్కడే   కుప్పకూలిపోయింది.

తుపాకీ శబ్దం విన్న కుటుంబ సభ్యులు వెంటనే మేడపైకి వచ్చారు. గాయాలతో ఉన్న రాధికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్లు ధృవీకరించారు. రాజేష్‌గుప్తా కుటుంబ సభ్యులు ఈవిషయాన్ని రాధిక తండ్రి రాకేష్‌కు తెలియచేశారు.

కాగా.. రాకేష్ అదనపు కట్నం కోసం తన కుమార్తెను హత్య చేశారని ఆరోపిస్తూ షాహాబాద్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి తుపాకీ, రాధిక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

రాధిక తుపాకీతో సెల్ఫీ తీసుకున్నఫోటోను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్‌పెక్టర్ శివశంకర్‌సింగ్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తుపాకీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..హత్య చేశారా అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

10TV Telugu News