woman arrested for assulting BMC marshal : మాస్క్ పెట్టుకోలేదని అడిగినందుకు మార్షల్ పై దాడిచేసిన మహిళ

దేశంలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లో కేసులు ఎక్కువ అవటంతో కొన్ని నగరాల్లో లాక్ డౌన్, మరికొన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించి కోవిడ్ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మహారాష్టలో మాస్క్ పెట్టుకోలేదని అడిగినందుకు ఓ మహిళ మార్షల్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన వెలుగు చూసింది.

woman arrested for assulting BMC marshal : మాస్క్ పెట్టుకోలేదని అడిగినందుకు మార్షల్ పై దాడిచేసిన మహిళ

Woman Arrested In Bmc

woman arrested for assulting BMC marshal over dispute about not wearing face mask : దేశంలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లో కేసులు ఎక్కువ అవటంతో కొన్ని నగరాల్లో లాక్ డౌన్, మరికొన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించి కోవిడ్ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

మాస్క్ ధరించమని, భౌతిక దూరం పాటించమని…శానిటైజర్ ఉపయోగించమని.. ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యనహరించటం వల్లే కేసులు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వాధికారులు కోవిడ్ నిబంధనలు అమలు చేయటానికి కొన్ని చోట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది. అధికారులపై తిరగబడుతున్న జనాల్ని చూస్తూనే ఉన్నాం. మహారాష్టలో మాస్క్ పెట్టుకోలేదని అడిగినందుకు ఓ మహిళ మార్షల్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన వెలుగు చూసింది.

బృహన్ ముంబై మున్సిపల్  కార్పోరేషన్  అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే పనిలో భాగంగా మాస్క్ పెట్టుకోని వారిని గుర్తించి  వారికి ఫైన్ వేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నాడు ముంబై లోని కండీవలీ వెస్ట్ ప్రాంతంలో మాస్క్ లేకుండా ఆటోలో వెళుతున్న జైనబ్ షైక్ అనే మహిళను… దహను కార్వాడీ జంక్షన్ వద్జ   బీఎంసీ మార్షల్ అశ్వని గుంజన్ అడ్డుకుంది.

మాస్క్ లేకుండా ఆటోలో ప్రయాణిస్తున్నందున ఫైన్ కట్టాలని అడిగింది. అందుకు అభ్యంతరం చెప్పిన జైనబ్ షైక్ తాను చున్నీని మాస్క్ లా ధరించానని చెప్పుకొచ్చింది. అలా కుదరదని తప్పని సరిగా మాస్క్ ధరించాలి కాబట్టి, ఫైన్ కట్టమని గుంజన్ చెప్పటంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

ఆ గొడవ మరింత ముదిరి …. జైనబ్ షైక్ ఆటో దిగి వచ్చి మార్షల్ పై దాడికి పాల్పడింది. మార్షల్ గుంజన్ ను కాలుతో తన్నుతూ  చెంపలు వాయించి… జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించింది.

ఇంతలో మరో మహిళా ఉద్యోగిని కూడా అక్కడకు చేరుకుని గుంజన్ కు అండగా నిలిచింది. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఇదంతా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈఘటనపై బీఎంసీ అధికారులు తీవ్రంగా స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మహిళపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో బీఎంసీ ఉద్యోగినికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో మాస్క్ లేకుండా తిరిగితే రూ. 200 జరిమానా విధిస్తున్నారు.