మైనర్ బాలిక ఫోటోను రేట్ కార్డుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహిళ అరెస్ట్

మైనర్ బాలిక ఫోటోను రేట్ కార్డుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహిళ అరెస్ట్

Woman arrested for posting minor girl picture with price tag on facebook : మైనర్ బాలిక ఫోటోను, కాల్ గర్ల్ గా చిత్రికరిస్తూ సోషల్ మీడియా లో పోస్టే చేసి ఆమె ఫోన్ నెంబరు ఇచ్చిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

గుజరాజత్, అహమ్మదాబాద్ లోని గోటా లో  నివసించే రాధాసింగ్ (32) అనే మహిళ తన ఫేస్ బుక్ అప్ డేట్ లో ఒక మైనర్ బాలిక ఫోటో పోస్ట్ చేసి దానిమీద రూ.2500 లుగా టెక్ట్స్ మెసేజ్ రాసి, దాని కింద ఆ బాలిక ఫోన్ నెంబరు పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఆపోస్ట్ చూసిన పలువురు బాలిక ఫోన్ నెంబరు కు ఫోన్ చేసి అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడటం చేయటం,ఫోటోలు పంపించటం, మెసేజ్ లు పంపించటం చేశారు.

ఇది గమనించిన బాలిక తండ్రి అహమ్మాదాబాద్ సైబర్ క్రెమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు ఫేస్ బుక్ ప్రోఫైల్ ఆధారంగా నిందితురాలిని గోటాలో అరెస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్ లోని మొరెనా కు చెందిన నిందితురాలు రాధాసింగ్ కొన్నాళ్లు ఢిల్లీలో నివసించింది. నాలుగేళ్ల క్రితం అహమ్మదాబాద్ కు తన మకాం మార్చింది. అహమ్మదాబాద్ వచ్చిన కొత్తల్లో పేయింగ్ గెస్ట్ గా ఉండి మైనర్ బాలిక తండ్రితో సన్నిహితంగా ఉండేది. ఇటీవలి కాలంలో వారిద్దరి మధ్య గొడవలు వచ్చి ఇద్దరూ దూరం అయ్యారు.

ఎట్టాగైనా అతడ్ని ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశ్యంతో అతడి కూతురు ఫోటోను కాల్ గర్ల్ గా చిత్రికరిస్తూ ఫేస్బుక్ లో ఫోటో అప్ లోడ్ చేసింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో శుక్రవారం రాధా సింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెపై పోక్సో చట్టం. ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.