పెళ్లి పేరుతో మహిళ ఘరానా మోసం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి రూ.కోటి కాజేసింది

మ్యాట్రిమోని వెబ్ సైట్ల ద్వారా మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ మోసాల్లో ఇటీవలి కాలంలో మ్యాట్రిమోని మోసాలు ఎక్కువయ్యాయి. గతంలో అనేక మోసాలు

  • Published By: naveen ,Published On : June 3, 2020 / 12:17 PM IST
పెళ్లి పేరుతో మహిళ ఘరానా మోసం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి రూ.కోటి కాజేసింది

మ్యాట్రిమోని వెబ్ సైట్ల ద్వారా మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ మోసాల్లో ఇటీవలి కాలంలో మ్యాట్రిమోని మోసాలు ఎక్కువయ్యాయి. గతంలో అనేక మోసాలు

మ్యాట్రిమోని వెబ్ సైట్ల ద్వారా మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ మోసాల్లో ఇటీవలి కాలంలో మ్యాట్రిమోని మోసాలు ఎక్కువయ్యాయి. గతంలో అనేక మోసాలు వెలుగుచూశాయి. తాజాగా మరో ఘరానా చీటింగ్ బయటపడింది. పెళ్లి పేరుతో ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను చీట్ చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడి నుంచి రూ.కోటి వసూలు చేసింది. హైదరాబాద్ లో ఈ ఘటన జరింది.

పెళ్లి పేరుతో కోటి రూపాయలు కాజేసింది:
పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మోసం చేసి రూ. కోటి కాజేసిన ఓ మహిళపై కేపీహెచ్‌బీ పీఎస్‌లో కేసు నమోదైంది. మోసం చేసిన మహిళ పేరు మాళవిక దేవటి అలియాస్‌ అనుపల్లవి మాగంటి. కూకట్‌పల్లి వసంతనగర్‌లో నివాసం ఉండే ఉప్పాలపాటి చైతన్య విహారి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్. తెలుగు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా అనుపల్లవి మాగంటి పేరుతో ఐడీ ఉన్న ఓ యువతి 2018లో చైతన్యకు పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్‌, వాట్సాప్‌ కాలింగ్‌ ద్వారా మాట్లాడుకుంటున్నారు.

న్యాయ పోరాటం కోసం డబ్బు అడిగింది:
తాను అమెరికాలో ఉంటానని, డాక్టర్‌గా పనిచేస్తున్నానని అనుపల్లవి చైతన్యను నమ్మించింది. తన తల్లిదండ్రులు డాక్టర్లని, జూబ్లీహిల్స్‌లో ఉంటారని చెప్పింది. కాగా, తనను పారిశ్రామికవేత్త కొడుక్కి ఇచ్చి వివాహం చేయాలని తన పేరెంట్స్ చూస్తున్నారని, తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని అనుపల్లవి చైతన్యతో చెప్పింది. తన బ్యాంకు ఖాతా నెంబర్లు నిలిపివేయించారని తెలిపింది. తల్లిదండ్రులపై న్యాయపోరాటం చేసేందుకు డబ్బు అవసరమని, తర్వాత మనం పెళ్లి చేసుకొందామని ఆమె చైతన్యను నమ్మించింది. ఆమె మాటలను గుడ్డిగా నమ్మిన చైతన్య.. పలుమార్లు ఆమె బ్యాంకు ఖాతాకు అమౌంట్ పంపాడు. అలా రూ.1,02,18,033 పంపాడు. ఆ తర్వాత ఆమె కాంటాక్ట్‌లో లేకుండా పోయింది. తాను మోసపోయినట్లు గ్రహించిన చైతన్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుపల్లవిని అరెస్ట్ చేశారు. కాగా, గతంలోనూ పలువురు ఎన్నారైలను ఈమె మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

6

పెళ్లి పేరుతో ఎన్నారై నుంచి రూ.65లక్షలు నొక్కిసేన కిలేడీ:
కాగా, ఇదే మహిళ పెళ్లి పేరుతో మరో ఎన్నారైని కూడా ఇలానే మోసం చేసింది. హైద‌రాబాద్ కు చెందిన మాళ‌విక(44), ఆమె భ‌ర్త శ్రీనివాస్, కొడుకు ప్ర‌ణ‌వ్ (22) క‌ల‌సి ఎన్నారైలు టార్గెట్ గా పెట్టుకుని మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. మాళ‌విక అనే మ‌హిళ త‌న పేరును కీర్తి మాధ‌వ‌నేని అని మార్చుకుని కొడుకు సాయంతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అమెరికాలో సాఫ్ట్ వేర్ గా ప‌నిచేస్తున్న వ‌రుణ్ అనే యువ‌కుడి నుంచి రూ.65 ల‌క్ష‌లు నొక్కేసింద‌ని చెప్పారు. ఆమె తన‌ను బాగా డ‌బ్బున్న ఫ్యామిలీకి చెందిన‌ డాక్ట‌ర్ గా ప‌రిచ‌యం చేసుకుంద‌ని, తండ్రి మ‌ర‌ణించ‌డ‌తంతో త‌న పేరున ఉన్న ఆస్తుల కోసం త‌ల్లి వేధిస్తోంద‌ని, వాటిని నిలిబెట్టుకోవ‌డం కోసం లీగ‌ల్ ఫైట్ కోసం డ‌బ్బు పంపాల‌ని కోరింద‌ని అన్నారు. ఆమె మాట‌ల్ని న‌మ్మిన వ‌రుణ్ రూ.65 ల‌క్ష‌లు చెప్పిన బ్యాంక్ అకౌంట్ల‌కు ట్రాన్స్ ఫ‌ర్ చేశాడ‌ని, అయితే ఆ త‌ర్వాత ఆమెను పెళ్లి గురించి అడిగితే స్పంద‌న లేక‌పోవ‌డంతో వ‌రుణ్ సైబ‌ర్ సెల్స్ కు ఫిర్యాదు చేశాడ‌ని చెప్పారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ కేసును ఛేదించి మాళ‌విక‌ను, ఆమె కొడుకు ప్ర‌ణ‌వ్ ను అరెస్టు చేశామ‌ని, ఆమె భ‌ర్త మాత్రం ప‌రారీలో ఉన్నాడ‌ని చెప్పారు. 2014లో అమెరికాలో ఉంటున్న ఓ ఎన్నారైని ఇలానే గీతాంజ‌లి అనే పేరుతో మోసం చేసింద‌ని, అప్పుడు ఆమె అత్త కూడా స‌హ‌క‌రించింద‌ని పోలీసులు తెలిపారు. మొత్తంగా మాళవిక లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కాగా, మాళవిక మాటలు నమ్మి లక్షలు, కోట్లు ఇవ్వడం అందరిని విస్మయానికి గురి చేస్తోంది.

Read: బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నం